సామజవరగమన.. స్టైలిష్ డ్యాన్సింగ్ ట్రీట్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘అల వైకుంఠపురములో’. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రచారంలో బన్ని టీమ్ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. తొలి పాట ‘సామజవరగమన’ విడుదలైన 24 గంటల్లో 60 లక్షల (6 మిలియన్) వ్యూస్ ని… 3 లక్షలకు పైగా లైక్స్ ని దక్కించుకుంది. యూట్యూబ్ లో ఇప్పటికే 7 కోట్ల వ్యూస్ ని దక్కించుకుంది. ఇటీవలి కాలంలో ఇంత వేగంగా అంతర్జాలంలోకి దూసుకెళ్లిన వేరొక పాట లేనే లేదు. ఎస్.ఎస్.థమన్ బ్రాండ్ మ్యూజిక్ అద్భుతంగా వర్కవుటైంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరో మాస్టర్ క్లాస్ లిరిక్ ని అందించారు.

అందుకే ఈ పాట విజువల్ గా ఎలా ఉండనుంది? అన్న ఉత్కంఠ ఇప్పటికే బన్ని అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ పాటను బన్ని-పూజ జంటపై ప్యారిస్ లో చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పాటలో మోస్ట్ స్టైలిష్ గా తనని తాను ఆవిష్కరించుకునేందుకు బన్ని స్పెషల్ కాస్ట్యూమ్స్ ని ఎంపిక చేసుకున్నాడు. అందుకోసం ప్యారిస్ లో ప్రఖ్యాత మాల్ కి వెళ్లి కాస్ట్యూమ్స్ ని కొనుక్కున్నారని.. పూజా కాస్ట్యూమ్స్ అంతే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకున్నారని ప్రచారమైంది.

తాజాగా బన్ని ఓ పోస్టర్ ని రివీల్ చేసి దానికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. సామజవరగమన.. ఆన్ ది వే! అంటూ స్టైలిష్ గా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో డ్యాన్సింగ్ మూవ్ మెంట్ ఉన్న ఫోటోని షేర్ చేశారు. బన్ని మార్క్ స్టెప్స్ కి కొదవే ఉండదని సిగ్నల్ ఇచ్చాడు. పోస్టర్ తో ఆసక్తి పెంచారు. విజువల్ గా ఎలా ఉండనుంది? అన్నది చూడాలి. 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home