కజిన్ తో స్టార్ హీరో గొడవలు?

0

ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు. ఒకోసారి బంధాలు కూడా అంతే. కమర్షియల్ లెక్కలు బయటే కాదు ఇంట్లోనూ ఉంటాయి. ఇప్పుడు స్టార్ హీరో సూర్యకు సంబంధించి ఇలాంటి చర్చే చెన్నై వర్గాల్లో జరుగుతోంది. విషయానికి వస్తే సూర్య కార్తీలకు కజిన్ వరసయ్యే జ్ఞానవేల్ రాజా మనకూ సుపరిచితుడే. ఈ అన్నదమ్ముల సినిమాల తెలుగు డబ్బింగ్ వెర్షన్లను గ్రీన్ స్టూడియో పేరుతో తీసుకొచ్చేది ఈయనే.

నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఆయనకు ఎన్నో ఏళ్ళ విశేష అనుభవం ఉంది. కాకపోతే సూర్య కజిన్ అనే బ్రాండ్ తో ఎక్కువ ప్రచారం లభించడంతో ఆ ఫామిలీ సపోర్ట్ తో సక్సెస్ అయ్యాడనుకుంటారు కానీ వాస్తవానికి ఆయన ఈ బ్రదర్స్ హీరోలు కాకముందే పరిశ్రమలో పేరు సంపాదించుకుని ఉన్నాడు. అయితే ఈ మధ్యకాలంలో సూర్యకు జ్ఞానవేల్ రాజాకు అంతర్గతంగా ఏవొ విభేదాలు వచ్చాయనే టాక్ కోలీవుడ్ సర్కిల్స్ బాగా నానుతోంది

ఇద్దరికీ పొసగడం లేదని అందుకే సూర్య విడిగా టూడి ఎంటర్ టైన్ మెంట్స్ అనే సంస్థను స్థాపించి భార్య జ్యోతిక నటించిన చిత్రాలు తాను హీరోగా రూపొందబోయే సినిమాలు అన్ని దాని పేరు మీదే రూపొందేలా ప్లానింగ్ చేసుకుని అమలు పరుస్తున్నాడని వాటిని బట్టి తెలుస్తోంది. నిజంగానే ఇప్పుడీ కొత్త సినిమాల పోస్టర్లలో కానీ పబ్లిసిటీలో కానీ ఎక్కడా గ్రీన్ స్టూడియోస్ ప్రస్తావన రావడం లేదు. దీనికి కారణం విభేదాలే అని సదరు గాసిప్స్ సారాంశం. అయితే సూర్య కానీ కార్తీ కానీ ఎక్కడా జ్ఞానవేల్ రాజా ప్రస్తావన తీసుకురావడం లేదు. అతనూ వీళ్ళ తాలూకు ట్రైలర్ల లాంచులు ఆడియో ఈవెంట్లలో ఎక్కువ కనిపించడం లేదు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.
Please Read Disclaimer