బిగ్ బాస్ కు రచ్చ ఫ్యాక్టరా.. లేక ఫుల్ ఎనర్జీనా?

0

బిగ్ బాస్ సీజన్ 3 త్వరలో ప్రారంభం కానుందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘కమింగ్ సూన్’ అంటూ బిగ్ బాస్ 3 ప్రోమోస్ కూడా రిలీజ్ అయ్యాయి. దీంతో ఈ సీజన్లో పాల్గొనే అభ్యర్థులపై చాలా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ లో ఇప్పటివరకూ నలుగురిని మాత్రమే ఫైనలైజ్ చేయడం జరిగిందని.. వారిలో పాపులర్ యాంకర్ శ్రీముఖి ఒకరని సమాచారం.

అదుర్స్.. అదుర్స్ 2.. మనీ మనీ.. భలే ఛాన్స్ లే.. పటాస్.. కామెడీ నైట్స్.. కామెడీ ఖిలాడీలు.. సరిగమప.. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించిన కార్యక్రమాల లిస్టు చాలా పెద్దదే. బిగ్ బాస్ హౌస్ కు శ్రీముఖి గ్లామర్ టచ్ ఇవ్వడం ఖాయమే కానీ అదే సమయంలో శ్రీముఖిది అంతా లౌడ్ వ్యవహారం. ముఖ్యంగా పటాస్ అంత పాపులర్ అయిందంటే తన లౌడ్ నెస్సే కారణం. తన వాయిస్ కానీ.. యాటిట్యూడ్ కానీ గోల గోల రచ్చ రంబోలా టైపు. హోస్టుగా వ్యవహరించే కార్యక్రమానికి అదెప్పుడూ ప్లస్ అవుతుంది.. ఎందుకంటే.. అలాంటి ఎనర్జీతో షో లైవ్లీ గా ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ పూర్తిగా డిఫరెంట్ కాబట్టి ఈ లౌడ్ నెస్ తనకు ప్రతికూలంగా మారే అవకాశం అయితే ఉంది. అంతే కాదు ఇతర హౌస్ మేట్స్ దాన్ని డామినేటింగ్ గా అనుకునే అవకాశం కూడా ఉంది.

మరి ఈ గోల గోల అక్కడ కూడా కంటిన్యూ చేస్తుందా.. లేదా అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి ఇదే క్వాలిటీ బిగ్ బాస్ హౌస్ కు సూట్ అయిందంటే మాత్రం క్లిక్ అవుతుంది. త్వరలోనే బిగ్ బాస్ ప్రారంభం అవుతుంది కాబట్టి మనకూ ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది లెండి. వీటితో సంబంధం లేకుండా శ్రీముఖి ఎంట్రీ తో బిగ్ బాస్ కు యూత్ లో మంచి క్రేజ్ రావడం పక్కానే.ఎందుకంటే తనకు మంచి ఫాలోయింగే ఉంది. ఈ సీజన్ ను జులై ఆఖరున ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే హోస్ట్ గా వ్యవహరించనున్న ‘కింగ్’ నాగార్జున కూడా ప్రెస్ మీట్ లో పాల్గొంటారట.