అమ్మడు టాట్టూతో కుమ్ముడు

0

కన్నడ చిన్నది శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో రెండు సినిమాలు చేసింది. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం జెర్సీ `సారా` పాత్రధారిగానే గుర్తుండిపోయింది. నేచురల్ స్టార్ నాని సరసన ఈ బ్యూటీ `జెర్సీ` చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. విధి ఆడిన ఆటలో విఫలమై చివరికి విజయాన్ని సాధించిన ఓ క్రికెటర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరపైకి తీసుకొచ్చారు. తొలి సారి తన రెగ్యులర్ పంథా చిత్రాలకు పూర్తి భిన్నంగా అడుగులు వేసే ప్రయత్నంలో నేచురల్ స్టార్ ఈ సినిమాలో నటించారు.

ఇందులో నానితో ప్రేమలోపడి చివరికి అతని భాగస్వామిగా నిత్యం భర్తకు కర్తవ్యాన్ని గుర్తుచేసే సారా అనే బాధ్యతాయుతమైన యువతిగా శ్రద్ధాశ్రీనాథ్ నటన విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకుంది. అజిత్ నటించిన `పింక్` తమిళ రీమేక్ `నేర్కొండ పార్వై`తో మళ్లీ వార్తల్లో నిలిచింది. తమిళంలో రికార్డు కలెక్షన్ లని సొంతం చేసుకున్న ఆ సినిమా అక్కడా శ్రద్ధాకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తెలుగులో `కృష్ణా అండ్ హిస్ లీలా` చిత్రంతో పాటు తమిళంలో రెండు.. కన్నడంలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ శ్రద్ధా ట్రెండీ స్టార్ గా వెలిగిపోతోంది.

తాజాగా ఓ ప్రయివేటు ఎంటర్ టైన్ మెంట్ చానెల్ 2020 పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్న శ్రద్ధా శ్రీనాథ్ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుడి వైపు ఎదపై పచ్చ బొట్టుతో కవ్వించింది. `జెర్సీ`లో హోమ్ లీ గాళ్ గా కనిపించి ఆకట్టుకున్న శ్రద్ధా తాజా పిక్ లో మాత్రం తన హాట్ టాటూతో ట్రెండీ టాపిక్ అయ్యింది. శ్రద్ధా ఎద అందాలపై టాటూతో ఫ్లర్ట్ చేస్తున్న శ్రద్ధా ఫోటోలు సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తున్నాయి.
Please Read Disclaimer