వైరల్ పిక్ : బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరంటే!

0

మూడున్నర నెలలుగా కొనసాగుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి ముగింపు కార్డు పడబోతుంది. మరో రెండు రోజుల్లో ఫైనల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే సోషల్ మీడియాలో ఫైనల్ విన్నర్ ఎవరు అనే విషయమై ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు విశ్లేషిస్తున్నారు. ఎక్కువగా ఈ సీజన్ విన్నర్ శ్రీముఖి లేదా రాహుల్ అంటున్నారు. వీరిద్దరిలో ట్రోఫీని ఎవరో ఒకరు అందుకోబోతున్నట్లుగా చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ ట్రోఫీని శ్రీముఖి పట్టుకుని నాగార్జునను ఆనందంతో హత్తుకుని ఉన్న ఈ ఫొటోను పోస్ట్ చేసి ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయ్యింది. శ్రీముఖి విన్నర్ అయ్యింది అంటూ ప్రచారం చేస్తున్నారు. శ్రీముఖికి అత్యధికంగా ఓట్లు రావడంతో సీజన్ 3 ట్రోఫీని నాగార్జున చేతుల మీదుగా అందుకుందంటూ పెద్ద ఎత్తున ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదని ఫైనల్ ఎపిసోడ్ చిత్రీకరణ ఇంకా జరగలేదని స్టార్ మా వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఆ ఫొటో మార్ఫింగ్ ఫోటో అని.. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదంటూ కొందరు అంటున్నారు. ఇక రాహుల్ అభిమానులు ఎలాగూ శ్రీముఖి సీజన్ 3 ట్రోఫీ పట్టుకోదు. కనీసం ఇలా మార్ఫింగ్ చేసి అయినా పట్టుకునేలా చేశారు లేండీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అంటూ చెబుతున్న ఈ ఫొటో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటీ అనేది ఆదివారం ఎపిసోడ్ తో తేలిపోబోతుంది.
Please Read Disclaimer