సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

శ్రీముఖి ఘాటు ఫోటో షూట్

0

బుల్లితెరపై తనదైన శైలిలో అలరిస్తూ ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న తెలుగు భామల్లో యాంకర్ శ్రీముఖి ఒకరు. భారీ పాపులారిటీతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా శ్రీముఖి సొంతం. అదుర్స్.. అదుర్స్ 2.. మనీ మనీ.. భలే ఛాన్స్ లే.. పటాస్.. కామెడీ నైట్స్.. కామెడీ ఖిలాడీలు.. సరిగమప.. ఇలా శ్రీముఖి ఎన్నో విజయవంతమైన షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని తన పాపులారిటీని మరింతగా పెంచుకుంది. ఈమధ్య ‘మోస్ట్ డిజైరబుల్ వుమన్ ఆన్ టీవీ’ టాగ్ కూడా సాధించింది.

ఇంత ఊపులో ఉన్న హాటు భామ సోషల్ మీడియాను వేడెక్కించకుండా ఉంటే ఎంత పరువు తక్కువ? ఆ విషయం శ్రీముఖి కూడా గుర్తించిందేమో కానీ ఒక ఘాటు ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలకు శ్రీముఖి ఇచ్చిన క్యాప్షన్ “వెల్ థ్యాంక్స్ 2020”. క్యాప్షన్ లో ఎక్కువగా చెప్పలేదు.. మనం కూడా “వెరీ వెల్ థ్యాంక్స్ 2020.. ఈ హాటు ఫోటోలకు” అంటూ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తెలుగు భామలు ఇలా ఇన్నర్ వేర్ లో పోజివ్వడం సాధారణ విషయం కాదు. అదీ దిశా పటాని స్టైల్ లో జిల్ జిల్ పోజులు నెటిజన్లకు ట్రీట్ ఇచ్చినట్టే కదా.

అందుకే నెటిజన్లు థ్రిల్లయ్యారు.. స్పందించారు. “స్మాల్ స్క్రీన్ హాటీ”.. “హాట్నెస్ కా మహారాణి” అని కొందరు కామెంట్లు పెట్టారు. ఒక చిలిపి నెటిజన్ మాత్రం “సంతోషంలో ఏదో మర్చిపోయినట్టున్నారు” అంటూ ఎంతో సున్నితంగా టాప్ గురించి ప్రస్తావించారు. మరో నెటిజన్ ఆనం వివేకా స్టైల్ లో “ఇదేందయ్యా ఇది.. ఇదేంది” అంటూ స్పందించారు. ఒక్కటి మాత్రం అర్థం అవుతోంది. అందరికీ స్పందనలు ఉన్నాయి. శ్రీముఖి ఫాలోయర్లలో రేసుగుర్రం శృతి హాసన్లు తక్కువే ఉన్నారబ్బా..!
Please Read Disclaimer