శ్రీముఖి అంచనా తప్పు కాలేదు…

0

బిగ్ బాస్ హౌస్ ఎలిమినేషన్ ప్రక్రియ ఎప్పుడు ఉత్కంఠగానే సాగుతుంది. షో మొదటి వారంలో హేమ ఎలిమినేట్ కాగా రెండో వారంలో జాఫర్ మూడో వారం తమన్నా ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారంలో ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చారు. శ్రీముఖి రవి రాహుల్ వరుణ్ శివజ్యోతి బాబా భాస్కర్ రోహిణిలు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. అయితే శనివారం ఎపిసోడ్ లో నాగార్జున శివజ్యోతి వరుణ్ లని సేఫ్ జోన్ లో ఉన్నట్లు ప్రకటించారు.

దీంతో ఆదివారం ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. నాగార్జున హౌస్ మేట్స్ తో సరదాగా గేమ్స్ ఆడిస్తూనే ఎలిమినేషన్ లో ఉన్న వారిని ఒక్కొక్కరుగా సేవ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మధ్యలో శ్రీముఖి సేవ్ అయినట్లు చెప్పారు. దీంతో శ్రీముఖికి అందరూ కంగ్రాట్స్ చెప్పారు. ఆ ఆ తర్వాత బాబా భాస్కర్ రవిలు సేవ్ అయినట్లు ప్రకటించారు. చివరికి రోహిణి రాహుల్ లు మిగిలారు.

ఈ ఇద్దరిలో రాహుల్ సేఫ్ అని చెప్పడంతో రోహిణి ఎలిమినేట్ అయిందని తెలిసిపోయింది. అయితే రోహిణి ఎలిమినేషన్ కి పరోక్షంగా తానే కారణం కావడంతో జ్యోతి వెక్కి వెక్కి ఏడ్చింది. నామినేషన్ టైంలో శివజ్యోతి – రోహిణిలు గుసగుసలాడటంతో రోహిణిని డైరెక్ట్గా ఎలిమినేషన్కి నామినేట్ చేశారు బిగ్ బాస్. పశ్చాత్తాపంతో చెంపపై కొట్టుకుంటూ శివజ్యోతి బోరు బోరున ఏడ్చింది.

అయితే ఇందులో శ్రీముఖి అంచనా తప్పలేదు. అంతకముందు వారం తమన్నా ఎలిమినేట్ అయిపోతుందని చెప్పిన శ్రీముఖి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది రోహిణినే అని చెప్పింది. దానికి రోహిణి కూడా చాలా బాధపడిన విషయం తెలిసిందే. ఫ్రెండ్ అయి ఉండి అలా ఎలా చెబుతావని అంతకుముందు ఎపిసోడ్ లో ఏడ్చింది కూడా. కానీ శ్రీముఖి అనుకున్న విధంగానే ఆదివారం ఎపిసోడ్ లో రోహిణి హౌస్ నుండి బయటకొచ్చేసింది.
Please Read Disclaimer