అనూకు ప్రమోషన్.. జబర్దస్త్ కు శ్రీముఖి

0

గత రెండు వారాలుగా జబర్దస్త్ వార్తలు జోరుగా మీడియాలో మరియు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నాయి. ఈటీవీలో గత 6 సంవత్సరాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న జబర్దస్త్ షో నుండి నాగబాబుతో పాటు యాంకర్ మరియు కమెడియన్స్ తప్పుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. నాగబాబు ఇప్పటికే జీ తెలుగు స్టేజ్ పై కనిపించాడు. జబర్దస్త్ కు చెందిన పలువురు కమెడియన్స్ తో జీ తెలుగులో లోకల్ గ్యాంగ్ అనే షో ప్రారంభించబోతున్నారు.

లోకల్ గ్యాంగ్ కామెడీ షోకు నాగబాబు ఒక జడ్జ్ గా వ్యవహరించబోతుండగా మరో జడ్జ్ గా యాంకర్ అనసూయ వ్యవహరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ నుండి అనసూయ తప్పుకోవడంతో ఆ స్థానంను శ్రీముఖిని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీముఖి గతంలోనే జబర్దస్త్ ఛాన్స్ వచ్చిందని కాని అప్పుడు మిస్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరోసారి జబర్దస్త్ ఛాన్స్ రావడంతో మరో ఆలోచన లేకుండా శ్రీముఖి ఓకే చెప్పిందని తెలుస్తోంది.

ఇక జబర్దస్త్ లో రోజాతో కలిసి జడ్జ్ మెంట్ చెప్పిన నాగబాబు ఇప్పుడు అనసూయతో కలిసి జడ్జ్ మెంట్ పోడియంను షేర్ చేసుకోబోతున్నాడు. ఇక యాంకర్స్ గా ప్రదీప్ మరియు రవి లేదా సుధీర్ వ్యవహరించే అవకాశం ఉంది. చాలా విభిన్నంగా ఈ కామెడీ షోను డిజైన్ చేస్తున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతుందని అతి త్వరలోనే ప్రోమోను విడుదల చేయబోతున్నట్లుగా బుల్లి తెర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇన్ని రోజులు యాంకర్ గా చేసిన అనసూయ జడ్జ్ గా ఎలా చేయబోతుందో చూడాలి.
Please Read Disclaimer