బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేట్ ఎవరో శ్రీముఖి చెప్పేసింది..!

0

మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్-3 లో ఎంటర్ టైన్ మెంట్ గట్టిగానే ఉంటుంది. ఎపిసోడ్లు పెరిగికొద్ది హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. బుధవారం ఎపిసోడ్ లో కూడా శ్రీముఖి-రోహిణిల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సరదాగా కూర్చుని మాట్లాడకుంటున్న సమయంలో ఈ వారం రోహిణి ఎలిమినేట్ అయిపోవచ్చని శ్రీముఖి అంది. దీనికి రోహిణి హర్ట్ అయింది. ఒక ఫ్రెండుగా ఉండి అలా ఎలా చెబుతావ్ అంటూ రోహిణి శ్రీముఖిని నిలదీసింది.

తాను ఒక అనాలిసిస్ ప్రకారం చెబుతున్నాని..ప్రస్తుతం ఎలిమినేషన్ లో రాహుల్ – వరుణ్ – జ్యోతి – బాబా భాస్కర్ – రవి తో పాటు శ్రీముఖి – రోహిణిలు ఉన్నారు. వీరిలో కొంచెం రోహిణికే తక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని శ్రీముఖి చెప్పుకొచ్చింది. దీంతో రోహిణి ఇంకా ఎక్కువ ఫీల్ అయింది. అసలు ‘ఫ్రెండ్ వి అయ్యుండి ఈవారం నేను ఎలిమినేట్ అయిపోతానని మొహం మీద ఎలా అంటావ్. ఎలిమినేట్ అవుతావేమో అనడం వేరు.. నువ్వు కచ్చితంగా వెళ్లిపోతావ్ అని చెప్పడం వేరు’’ అని రోహిణి బాధపడింది.

దీనికి శ్రీముఖి బదులిస్తూ.. ‘‘తమన్నా విషయంలో నేను ఊహించిందే జరిగింది. ఇప్పుడు అదే విధంగా అనాలసిస్ చేశాను. అంతే.. నువ్వు ఎలిమినేట్ అయిపోతావ్ అని నేను చెప్పడంలేదు’’ అంటూ ఏదో సర్ది చెప్పే పని చేసింది. తమన్నా విషయంలో జరిగిందంటే నా విషయంలో కూడా జరుగుతుందనే కదా నీ ఉద్దేశం’’ అని శ్రీముఖి దగ్గర నుంచి రోహిణి బెడ్ రూంలోకి వెళ్లిపోయింది.

అక్కడకు వెళ్ళి ఆమె కంటతడి పెట్టుకుంటే ఇతర మహిళా సభ్యులు ఓదారాస్తూ శ్రీముఖి అలా మాట్లాడకూడదు అని అన్నారు. ఇక అది చూసిన శ్రీముఖి తమ మధ్య మూడో వ్యక్తి దురకూడదని చెప్పి. తానే రోహిణిని ఓదార్చడం మొదలుపెట్టింది. వేరే వాళ్లు అంటే తాను ఫీలయ్యేదాన్ని కాదని ఫ్రెండ్వి నువ్వే అలా అనేసరికి బాధనిపించిందని చెప్పింది. దీంతో రోహిణికి శ్రీముఖి క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు అనని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
Please Read Disclaimer