బిగ్‌బాస్ 4లో `న‌గ్నం` బ్యూటీ?

0

బిగ్‌బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా ఈ సిరీస్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్‌ల‌ని ఎంపిక చేస్తున్నారంటూ జోరుగా వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రో హాటీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. బిగ్‌బాస్ సీజ‌న్ 4లో వ‌ర్మ `న‌గ్నం` చిత్రంతో ప‌రిచ‌యం చేసిన స్వీటీ అలియాస్ శ్రీ రాపాక కంటెస్టెంట్‌గా పాల్గొన నుంద‌ని తాజాగా ఓ వా‌ర్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

రామ్‌గోపాల్‌వ‌ర్మ రూపొందించిన `న‌గ్నం` చిత్రంలో మ‌రింత బోల్డ్‌గా న‌టించి వార్త‌ల్లో నిలిచింది శ్రీ రాపాక‌. ఇటీవ‌ల ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన శ్రీ ప‌లువురిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న విష‌యం తెలిసిందే. `న‌గ్నం` సినిమా ప్ర‌మోష‌న్‌తో పాటు బిగ్‌బాస్ సీజ‌న్ 4లో అవ‌కాశం కోస‌మే శ్రీ రాపాక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ అటెన్ష‌న్ క్రియేట్ చేస్తోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

బిగ్‌బాస్ సీజ‌న్ కోసం ఇప్ప‌టికే హీరో త‌రుణ్‌, మంగ్లీ, బిత్తిరి స‌త్తితో పాటు హాట్ హీరోయిన్స్ హంసా నందిని, శ్ర‌ద్దా దాస్‌, యామినీ భాస్క‌ర్‌, ప్రియా వ‌డ్ల‌మానిల‌ని ఎంపిక చేశారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సీజ‌న్‌ని మ‌రింత క్రేజీగా స్టార్ట్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే నిర్వాహ‌కులు హాట్ హీరోయిన్‌ల‌ని సెలెక్ట్ చేస్తున్నార‌ని జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. ఇందులో భాగంగానే శ్రీ రాపాక ని బిగ్‌బాస్ సీజ‌న్ కోసం నిర్వాహ‌కులు ఎంపిక చేయాల‌నుకుంటున్నార‌ట‌. మ‌రి ఈ వార్త‌ల‌పై శ్రీ రాపాక‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.