తన కొత్త లుక్ తో ఫైర్ పుట్టించిన శ్రీరెడ్డి

0

పొద్దు పొడిచింది మొదలు పొద్దుగూకే వరకూ వివాదాలతో సహజీవనం చేస్తున్నట్లు వ్యవహరించే సినీ నటి శ్రీరెడ్డి. ఆమె నోటి ముందు ఎవరైనా బలాదూరే అన్నట్లుగా ఆమె తీరు ఉంటుంది. పేరుకు సినీ నటి అన్నమాటే కానీ.. ఇప్పటి వరకూ ఆమెకున్న టాలెంట్ ను సరిగా ప్రదర్శించిందే లేదన్న పేరుంది.

తాజాగా తన తీరుకు భిన్నంగా వ్యవహరించింది. చెన్నైలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె.. తనలోని గ్లామర్ కంటెంట్ ను వెలికి తీసింది. డిజైనర్ రిను అనుకంల్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో వెలిగిపోయింది. వివాదాలే కాదు.. గ్లామర్ కంటెంట్ తనలో టన్నుల లెక్కన ఉందన్నట్లుగా ర్యాంప్ మీద హోయలు పోయింది. ఆసక్తికరమైన అంశం ఈ ఫ్యాషన్ షో రైతుల సంక్షేమం కోసం కావటం. వారికోసం నిధులు సేకరించే నిమిత్తం ప్రవోలియన్ అనే సంస్థ చెన్నైలో ఫ్యాషన్ షోను నిర్వహించింది.

సినీ తారలు సాక్షి అగర్వాల్.. హుమా ఖురేషి.. సంచితాశెట్టి లాంటి పలువురితో పాటు శ్రీరెడ్డి ర్యాంప్ పై హోయలొలికించారు. అల్ట్రా మోడ్రన్ గా..తన భారీ అందాల్ని కనువిందు చేసేలా.. తనను తాను కొత్త యాంగిల్ లో చూపించేలా శ్రీరెడ్డి క్యాస్టూమ్స్ ఉన్నాయని చెప్పాలి. తాజాగా తన ర్యాంప్ షోకు సంబంధించిన ఫోటోల్ని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలు ఆమె అభిమానుల్నే కాదు.. సౌందర్య ఆరాధకుల్ని సైతం షాక్ కు గురి చేసేలా ఉన్నాయి. ఏమైనా.. ఇంతకాలం ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలతో తనకున్న ఇమేజ్ ను తాజా ఫ్యాషన్ షోతో చెరిపేయటమే కాదు.. తనలో టన్నుల కొద్దీ గ్లామర్ కంటెంట్ ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Please Read Disclaimer