బన్నీ కెరీర్ ప్లానింగ్ వల్లే ఆ హీరో సెటిల్

0

అల్లు అర్జున్ ఒక సినిమా ఎంపిక చేసుకునే సమయంలో చాలా విషయాలను పరిగణలోకి తీసుకుని మరీ చేస్తాడంటూ ఆయన సన్నిహితులు మరియు అభిమానులు అంటూ ఉంటారు. అల్లు అర్జున్ చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి అనుభవంను సొంతం చేసుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ అనుభవంతోనే యువ హీరో శ్రీవిష్ణుకు ఈయన ఇచ్చిన సలహాతో కెరీర్ మారిపోయిందట. శ్రీవిష్ణుకు కెరీర్ ఆరంభంలో బన్నీ ఇచ్చిన సలహా మేరకు సినిమాలు చేస్తున్నాడట.

‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ స్వయంగా ఆ సినిమాలో నటించిన శ్రీవిష్ణు ను పిలిపించుకుని మాట్లాడాడట. ఆ సమయంలో కమర్షియల్ సినిమాల కంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేయమంటూ సలహా ఇచ్చాడట. ప్రయోగాత్మక చిత్రాలు చేయడం వల్లే ఇప్పటి వరకు శ్రీవిష్ణు కెరీర్ కొనసాగుతూ వచ్చిందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందరు యువ హీరోల మాదిరిగా కమర్షియల్ సినిమాలపై మోజుతో ఆ సినిమాలు చేసినట్లయితే ఖచ్చితంగా శ్రీవిష్ణు కెరీర్ అప్పుడే ఎండ్ అయ్యి ఉండేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చేశాడు కనుకే శ్రీవిష్ణుకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ స్థాయి గుర్తింపు ఉందని చాలా మంది అనుకుంటున్నారు.

బన్నీ సలహా మేరకు శ్రీవిష్ణు కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండటం మంచిదే అయ్యింది. అందుకే బన్నీ సినిమాల ప్లానింగ్ పక్కాగా ఉంటుందని ఆయన సన్నిహితులు అంటారు. ఇండస్ట్రీలోని పలువురు బన్నీ ఫ్రెండ్ సినిమాల విషయంలో తప్పకుండా సలహాలు తీసుకుంటారట.
Please Read Disclaimer