రైటర్ కి అవకాశమిచ్చిన హీరో !

0

టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్నప్పటికీ కొత్త దర్శకులకే అవకాశం ఇస్తూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న శ్రీ విష్ణు. సినిమా సినిమాకు కథ – క్యారెక్టర్ పరంగా తేడా ఉండేలా చూసుకుంటూ చిన్న హీరోల్లో బెస్ట్ అనిపించుకుంటున్నాడు కూడా. లేటెస్ట్ గా ‘బ్రోచేవారెవరురా’తో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నాడు. శ్రీ విష్ణు నెక్స్ట్ సినిమాతో రచయిత హాసిత్ గోలి మెగాఫోన్ పట్టబోతున్నాడు.

హాసిత్ గోలి దర్శకుడు వివేక్ ఆత్రేయ దగ్గర రచయిత గా పనిచేశాడు. శ్రీ విష్ణు – వివేక్ కాంబినేషన్ లో వచ్చిన ‘మెంటల్ మదిలో’ – ‘బ్రోచేవారెవరురా’ సినిమాలకు రచనా సహకారం అందించాడు. ‘బ్రోచేవారేవరురా’ సమయంలోనే శ్రీ విష్ణు కి ఓ కథను వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు హాసిత్. ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం తప్పరా మీసం అనే సినిమా చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది.
Please Read Disclaimer