ఈసారీ ఇద్దరిని లైన్ లో పెట్టిన యువహీరో

0

ఒక్కరు కాదు ఇద్దరు ముద్దు. ఇద్దరేసి నాయికలు సరసన నటిస్తే ఆ కిక్కే వేరు! అంటున్నాడు ఆ యంగ్ హీరో. డబుల్స్ తో నటించడం అతడికి కొత్తేమీ కాదు కానీ పదే పదే అదే కావాలని కోరుకోవడమే విడ్డూరం. అయితేనేం `నివేదా` పేరున్న నాయికల్ని అతడు రిపీట్ చేస్తున్నాడు. ఆ ఇద్దరూ అతడికి అలా అచ్చి వచ్చేస్తున్నారు మరి.

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ఈసారి కూడా ఇద్దరు నాయికల కోసం వలేస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన హ్యూమర్ అలానే ఎమోషన్ డ్రామాని వదిలేసి..! కమర్షియల్ ఎక్స్ పెర్మెంట్స్ చేసిన ప్రతిసారీ శ్రీ విష్ణు హిట్టు రాక బోల్తా పడుతున్న అతడు తిరిగి పాత దారిలోకి వచ్చేస్తున్నాడట. శ్రీవిష్ణు లాస్ట్ మూవీ `తిప్పరా మీసం` అడ్రెస్ లేకుండా పోయింది..! ఈ నేపథ్యంలో ఇప్పుడు మనోడు హ్యూమర్ బేస్ డ్ స్టోరీలో నటిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్లుగా నివేధా థామస్- నివేధా పేథురాజ్ లను హీరోయిన్లుగా తీసుకుంటున్నట్లుగా సమాచారం.

`బ్రోచేవారెవురా` సినిమా కోసం కూడా శ్రీ విష్ణు వీరిద్దరినే హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నాడు. మరోసారి ఆ ఇద్దరినే రిపీట్ చేస్తుండడం ఆసక్తికరం. డబుల్ హీరోయిన్లతో డబుల్ హిట్టు కొట్టేయాలన్న ప్లాన్ ప్రతిసారీ వర్కవుటవుతుందా లేదా? అన్నది కాస్త ఆగితే కానీ చెప్పలేం. అయితే నివేద పేరు మాత్రం అతడికి అలా కలిసొచ్చేస్తోంది. లవ్ .. ఎమోషన్.. వాస్తవిక కథలతో ఇంప్రెస్సివ్ గా చేసే ప్రయత్నమేదీ ఫెయిలవ్వదు. మరి శ్రీవిష్ణు ఈసారి కూడా అలాంటి మ్యాజిక్ చేస్తాడా లేదా? అన్నది చూడాలి.