బిగ్ బాస్ 3: శ్రీముఖి రెమ్యూనరేషన్ లీక్

0

బిగ్ బాస్ లోకి తాను ఇష్టంతో ఇంటెన్షన్ తో వచ్చానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. ఆమె పారితోషికంపై ఎన్నో కథనాలు గాసిప్ప్ వచ్చాయి. కానీ తాజాగా బిగ్ బాస్ టీం నుంచి శ్రీముఖి రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం లీక్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఒక దక్షిణాది స్టార్ హీరోయిన్ అందుకునే పారితోషికాన్ని శ్రీముఖికి ఆఫర్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి..

బిగ్ బాస్ ఇంట్లో ఉండే ప్రతీ రోజుకు శ్రీముఖికి ఏకంగా 3.5 లక్షలు ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం ఒప్పందం చేసుకుందని.. ఇంత భారీ పారితోషికం ఆఫర్ చేయబట్టే బిగ్ బాస్ లోకి శ్రీముఖి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన వందరోజులు గనక ఉండి ఫైనల్స్ లో పాల్గొంటే శ్రీముఖికి ఏకంగా 3.5 కోట్ల పారితోషికం వస్తుందన్న మాట.. అంటే మన దక్షిణాది హీరోయిన్లు సినిమాకు తీసుకునే మొత్తం కంటే రెండు రెట్లు ఎక్కువ.

అయితే ఇదంతా అనధికార లెక్క మాత్రమే. రెమ్యూనరేషన్ పై అటు శ్రీముఖి ఇటు బిగ్ బాస్ నోరు విప్పరు. సో అక్కడి నుంచి వ్యాపిస్తున్న వార్తలను బట్టి బిగ్ బాస్ లో పాల్గొంటున్న శ్రీముఖి పంట పండినట్టేనన్న ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.




Please Read Disclaimer