మహమ్మారీ లాక్ డౌన్ యాంకర్ ని అడ్డంగా బుక్ చేసింది

0

యాంకర్లు కథానాయికలుగా రాణిస్తున్నారు. ఉదయభాను.. అనసూయ.. రేష్మి గౌతమ్ లాంటి యాంకర్లు ఇప్పటికే నిరూపించుకున్నారు. ఝాన్సి.. శిల్పా చక్రవర్తి సహా పలువురు యాంకర్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించారు. ఆ తర్వాత జాబితాలో యాంకర్ శ్రీముఖి పేరు కూడా చేరింది. శ్రీముఖికి కథానాయికగా నటించడం కొత్తేమీ కాదు. ప్రేమ ఇష్క్ కాదల్ లాంటి ప్రేమకథా చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పటికే మెయిన్ లీడ్ లో పలు చిత్రాలు చేసింది.

కానీ ఇటీవల పెద్ద తెరకు బిగ్ గ్యాప్ వచ్చింది ఎందుకనో. తెలుగు టెలివిజన్లో యాంకర్ గా బాగా బిజీ కాబట్టి శ్రీముఖి చాలా కాలం తర్వాత ఒక సినిమా చేసి థియేట్రికల్ రిలీజ్ కావాలని ఆశించినా.. మహమ్మారీ లాక్ డౌన్ అడ్డంగా బుక్ చేసింది. ఈ పరిస్థితి శ్రీముఖి ఆశలను చంపేసింది. తన తాజా చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయలేని ధైన్యం నెలకొంది మరి.

శ్రీముఖి ప్రధాన పాత్రలో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన `ఇట్స్ టైమ్ టు పార్టీ` ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది. గౌతమ్ E.V.S దర్శకత్వం వహించిన థ్రిల్లర్ మూవీని సెప్టెంబర్ 11 న OTT లో రిలీజ్ చేసేయనున్నారని తెలుస్తోంది. శ్రీముఖి కి ఉన్న ఫాలోయింగ్ పెద్దదే కాబట్టి ఓటీటీకి కూడా కలిసొస్తుందనే భావిస్తున్నారు. సూర్య.. నానీ.. కీర్తి సురేష్ లాంటి స్టార్లు నటించిన సినిమాల్నే ఓటీటీల్లో వదిలేస్తుంటే ఇక యాంకర్ల సినిమాల్ని వదిలేయరా? అంటూ పంచ్ లు వేస్తున్నారు కొందరైతే.