ఆ విషయంలో రాహుల్ కంటే శ్రీముఖి దే పైచేయి

0

బిగ్ బాస్ సీజన్ 3 పూర్తి అయ్యింది. శ్రీముఖి రన్నర్ గా నిలువగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచిన విషయం తెల్సిందే. హైదరాబాదీ గల్లీ కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్ అనూహ్యంగా అందరి మద్దతుతో విజేతగా నిలిచాడు. స్టార్ సెలబ్రెటీ స్టేటస్ తో శ్రీముఖి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఖచ్చితంగా విజేతగా నిలుస్తుందని అంతా అనుకున్నా కూడా చివరికి అంచనాలు తారుమారు అయ్యి రాహుల్ విజేతగా నిలిచాడు. రాహుల్ విజేతగా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకున్నా కూడా షో పేరు మీద శ్రీముఖికి ఎక్కువ నగదు దక్కినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

శ్రీముఖి స్టార్ యాంకర్ అవ్వడంతో పాటు ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమెకు ఒక్క రోజుకు గాను 1.5 లక్షల చొప్పున పారితోషికం ఇచ్చి బిగ్ బాస్ సీజన్ 3 కి తీసుకున్నారట. వంద రోజులు ఆమె ఇంట్లో ఉంది కనుక కోటిన్నర వరకు ఆమెకు కేవలం పారితోషికంగానే వచ్చాయట. ఇక హీరోగా పలు సినిమాల్లో నటించిన వరుణ్ సందేశ్ కు కూడా భారీగానే పారితోషికం ఇచ్చారట. రోజుకు లక్షల రూపాయల చెప్పున ఆయనకు ఇవ్వడంతో కోటి రూపాయలు ఆయనకు అందాయని ప్రచారం జరుగుతోంది.

ఇక రాహుల్ కు పారితోషికం రూపంలో 30 లక్షల వరకు అందగా ప్రైజ్ మనీ 50 లక్షల రూపాయలు దక్కింది. అంటే మొత్తంగా 80 లక్షల రూపాయలు రాహుల్ పొందాడట. గత సీజన్ లో కూడా విన్నర్ గా నిలిచిన కౌశల్ కంటే రన్నర్ గా నిలిచిన ప్రముఖ సింగర్ గీతామాధురి ఎక్కువగా దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతం అయ్యింది. ప్రైజ్ మనీ… పారితోషికంది ఏముంది బిగ్ బాస్ ట్రోఫీ రాహుల్ కు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
Please Read Disclaimer