జగ్గూ భాయ్ కి నేను లక్కీ ఛామ్ అంటున్న వర్మ హీరోయిన్

0

టాలీవుడ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగి ఫ్యామిలీ హీరోగా దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ డం అనుభవించిన జగపతి బాబు కొన్నాళ్ల పాటు ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. ఏవో కారణాల వల్ల జగపతిబాబు ఆస్తులను అమ్ముకోవడంతో పాటు అప్పులు చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఆయనే చాలా సార్లు చెప్పాడు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు వర్మ దర్శకత్వంలో వచ్చిన నగ్నం సినిమాతో నటిగా అందరికి పరిచయం అయిన శ్రీ రాపా ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు గురించి ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది.

జగపతి బాబు గారు ఒకానొక సమయంలో తీవ్రమైన ఆర్థక సమస్యలను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో నేను ఆయనకు పరిచయం అవ్వడంతో నాతో పరిచయం కారణంగా ఆయన మళ్లీ పుంజుకున్నారంటూ తనకు తానుగా డబ్బా కొట్టుకుంటోంది. జగపతి బాబుతో ఈమెకు పిల్లా నువ్వులేని జీవితం సినిమా సమయంలో పరిచయం అయ్యిందట. ఆ సినిమాకు ఈమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా చేసిందట. శ్రీహరి గారు మృతి చెండటంతో ఆయన పాత్రలోకి జగపతి బాబు గారు వచ్చారు.

ఆ సినిమా షూటింగ్ సమయంలో జగపతిబాబు గారు ఎక్కువగా ఒంటరిగా కూర్చోవడంతో పాటు డిప్రెషన్ లో ఉండేవారు. ఒకసారి నేను వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆ సమయంలో ఆయన నాతో సరిగా మాట్లాడలేదు. ఏమైంది సార్ అంటూ నేను ఒకటి రెండు సార్లు అడుగగా అప్పుడు ఆయన తన పరస్థితి గురించి తెలియజేశారు. అప్పుడు ఆయనకు నేను మనో ధైర్యం ఇచ్చేదాన్ని. నేను మీకు పరిచయం అయ్యాను కదా సార్ ఇక మీ జీవితం మారిపోతుంది అనేదాన్ని. నేను అన్నట్లుగానే ఆయన కొన్నాళ్లకే కోట్లు సంపాదించారు. పూర్తిగా నాతో పరిచయం వల్ల అని నేను అనుకోను కాని నాకు నేను పాజిటివ్ గా నాతో ఎవరైనా మాట్లాడితే పరిచయం చేసుకుంటే బాగు పడుతారని నమ్ముతున్నాను అంటోంది.