దమ్ముంటే పేరు చెప్పాలంటూ సవాల్ విసిరిన శ్రీరెడ్డి

0

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు నటి శ్రీరెడ్డి. కొన్నిసార్లు అనుకోకుండా.. మరికొన్నిసార్లు కావాలనే ఆమె వివాదాలతో సావాసం చేస్తుంటారు. తమ దారిన తాము పోయే వారిని సైతం.. ఎందుకలా ఉంటావ్.. ఇలా ఎందుకు ఉండవని కెలుకుతారు. తాజాగా అలాంటి పనే చేసింది శ్రీరెడ్డి. విడతల వారీగా ఒక్కో ప్రముఖుడ్ని ఒక్కోసారి ఉతికి ఆరేసే శ్రీరెడ్డి తాజాగా నటి పూనమ్ కౌర్ మీద పడ్డారు.

ఈ మధ్యనే పూనమ్ ఒక ట్వీట్ చేశారు. సదరు ట్వీట్ సంచలనంగా మారటమే కాదు.. చాలానే అనుమానల్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఇంతకీ పూనమ్ చేసిన ట్వీట్ కు తెలుగీకరిస్తే.. అబద్ధం ఆడేవాడు రాజకీయ నాయకుడు అవుతాడేమో కానీ నాయకుడు.. ఎప్పటికీ లీడర్ మాత్రం కాలేడంటూ ట్వీట్ చేసింది. ఇంతకీ తాను ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశానన్న విషయాన్ని పూనమ్ బయటపెట్టలేదు. ఈ ట్వీట్ కు తాజాగా రియాక్ట్ అయ్యారు శ్రీరెడ్డి.

ప్రస్తుతం మురుగన్ మాట వేసుకున్న శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో రెండు పోస్టులు పెట్టారు. దమ్ముంటే ధైర్యంగా ట్వీట్స్ చేయ్.. పేరు పెట్టు.. మావాడు చూసుకుంటాడు.. అంతేకానీ ఈ దొంగచాటు ట్వీట్లు ఎందుకంటూ ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి. ఆమె విసిరిన సవాలుకు పూనమ్ రియాక్ట్ అవుతారా? శ్రీరెడ్డితో పెట్టుకోవటం ఎందుకంటూ తనదైన నర్మగర్భ స్టైల్లో మరిన్ని పోస్టులు పెడతారా? అన్నది చూడాలి.
Please Read Disclaimer