టాలీవుడ్ ఇండస్ట్రీ చెడ్డది…శ్రీరెడ్డి!

0టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి ప్రారంభించిన పోరాటం…..ఎన్నో అనూహ్యమైన మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. అర్ధనగ్న ప్రదర్శనతో మొదలై మీడియాలో హైప్ క్రియేట్ చేసుకున్న శ్రీరెడ్డి …ఆ తర్వాత సోషల్ మీడియాకే పరిమితం కావాల్సిన పరిస్థితులు తెచ్చుకుంది. కొద్ది కాలం క్రితం చెన్నైకు మకాం మార్చిన శ్రీరెడ్డి….పలువురు కోలీవుడ్ హీరోలు – దర్శకులపై కూడా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన శ్రీరెడ్డి….మరోసారి టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలలో కెల్లా టాలీవుడ్ చెడ్డదని షాకింగ్ కామెంట్స్ చేసింది. కేవలం నాలుగు కుటుంబాల చేతుల్లోనే ఇండస్ట్రీ ఉందని ఆరోపించింది.

తెలుగు సినిమా ప్రేక్షకులు….పెద్ద హీరోల సినిమాలనే చూస్తారని శ్రీరెడ్డి చెప్పింది. ఆ నాలుగు కుటుంబాల కనుసన్నల్లో టాలీవుడ్ నడుస్తోందని – అక్కడ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయరని శ్రీరెడ్డి ఆరోపించింది. అందుకే టాలీవుడ్ అంత చెడ్డ ఇండస్ట్రీ మరోటి లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే తమిళ ఇండస్ట్రీలో చిన్న బడ్జెట్ చిత్రాలకు కూడా గుర్తింపు దక్కుతుందని తెలిపింది. జయలలిత తన రోల్ మోడల్ అని – తాను చెన్నైలో సెటిల్ కావాలనుకుంటున్నానని చెప్పింది. గ్లామర్ పాత్రలలో – బికినీలు వేసుకొని నటించడం తనకు ఇష్టం లేదని….మహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్రలే చేస్తానని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన చేతినిండా సినిమాలున్నాయని `రెడ్డి డైరీ`తోపాటు మరో రెండు సినిమాలకు ఓకే చెప్పానని తెలిపింది. తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే లీకులు కంటిన్యూ చేస్తానని చెప్పింది. భవిష్యత్తులో అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని హింట్ ఇచ్చింది.