ఈ శ్రీ రెడ్డి ఆ శ్రీ రెడ్డి ఒక్కటేనా?

0

టాలీవుడ్ ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకం గా పరిచయం అక్కర్లేదు. సినిమా గురించి కొద్దొగొప్పో అవగాహణ ఉన్న వారికి కూడా శ్రీరెడ్డి గురించి తెలిసి పోయింది. ఆమె చేసిన సినిమాలు ఏమీ లేకపోయినా కూడా ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న సందడి.. అంతకు ముందు కొన్ని తెలుగు న్యూస్ ఛానెల్స్ లో చేసిన హంగామా కారణంగా ఆమె అందరికి తెలిసి పోయింది. పాపులర్ ఫిగర్స్ ను లేదంటే ఏదైనా పాపులర్ సంఘటనలు సినిమాలుగా చేయడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. అలాగే శ్రీరెడ్డి పేరు మీద సినిమా చేసేందుకు సిద్దం అయ్యారు.

‘శ్రీరెడ్డి దొరికి పోయింది’ అనే టైటిల్ తో రాహుల్ పరమహంస దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఆర్యన్ మరియు ఉపాసన జంటగా ఈ చిత్రం లో నటిస్తున్నారు. హర్రర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రం టైటిల్ కు మానవ మృగాలకు అంటూ క్యాప్షన్ పెట్టారు. శ్రీరెడ్డి దొరికి పోయింది మానవ మృగాలకు అంటూ టైటిల్ పెట్టడం తో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా లో ఈ చిత్రం గురించి ఎవరికి తోచినట్లు గా వారు ఊహించుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

ఈ చిత్రం కథకు శ్రీరెడ్డి కి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రం వెనుక శ్రీరెడ్డి ఉందా లేదంటే కేవలం ఆ పేరును మేకర్స్ వాడుకుంటున్నారా అనే విషయమై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాపై అయితే శ్రీరెడ్డి స్పందించలేదు. తన పేరును వాడుతున్నారు అనే విమర్శలు ఏమైనా చేయనుందా లేదంటే లైట్ తీసుకుంటుందా అనేది చూడాలి. శ్రీరెడ్డికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ అయితే దక్కింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Please Read Disclaimer