రైతుల సంక్షేమ నిధి కోసం శ్రీరెడ్డి హాట్ ఫ్యాషన్ షో

0

హైదరాబాద్‌లో వివాదాలకు తెరలేపి చెన్నై వెళ్లిపోయింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. అక్కడ కూడా వివాదాల వైపు వెళ్లినా ఎందుకో ఈ మధ్య ఆపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మాత్రమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటోంది. అయితే, శ్రీరెడ్డి తాజాగా చెన్నై నగరంలో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో పాల్గొంది.

రైతుల సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు ప్రవోలియన్ సంస్థ చెన్నైలో ప్రవోలియన్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహించింది. నవంబర్ 3వ తేదీ రాత్రి జరిగిన ఆఖరి రోజు ఫ్యాషన్ షోలో శ్రీరెడ్డి పాల్గొంది. ఈమెతో పాటు సినీ తారలు సాక్షి అగర్వాల్, హుమా ఖురేషి, సంచితాశెట్టి ర్యాంప్‌పై హొయలొలికించారు.

అయితే, వీరందరి కంటే శ్రీరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి కారణం ఆమె ధరించిన దుస్తులు. ఆల్ట్రా మోడరన్‌గా ఉంది ఆమె డ్రెస్. అందాలు ఆరబోస్తూ ర్యాంప్‌పై హొయలొలికించింది శ్రీరెడ్డి. ఈ ఫొటోలను తాజాగా ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసి ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు, మోడలింగ్‌లో తాము హాలీవుడ్ స్టార్స్ నికీ మినాజ్, కార్డీ బిలకు గట్టి పోటీనివ్వగలం అని కూడా శ్రీరెడ్డి పేర్కొంది.

కాగా, ఈ ఫ్యాషన్ వీక్‌లో నటుడు, మోడల్ గణేష్ వెంకట్రామన్ – నిషా దంపతులు కూడా పాల్గొన్నారు. అలాగే, మాజీ క్రికెటర్, నటుడు శ్రీశాంత్‌తో పాటు పలువురు మోడళ్లు ర్యాంప్‌పై నడిచారు. ఈ షోలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు రిను అలుంకల్, రూపా పాటిల్, హీనా కౌశర్, సౌరవ్ మజుందర్, రేష్మా కున్హి, హరి ఆనంద్ రూపొందించిన దుస్తులను మోడళ్లు ప్రదర్శించారు. సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ సమీర్ ఖాన్ పర్యవేక్షణలో ఫ్యాషన్ షో జరిగింది. కాగా, శ్రీరెడ్డి దుస్తులను రిను అలుంకల్ డిజైన్ చేశారు.
Please Read Disclaimer