రానా బావ అంటూ శ్రీరెడ్డి సంచలన ట్వీట్

0

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి మిహీకాల నిశ్చితార్థం ఈ రోజు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో జరగనుంది. రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 4గం.లకి ఈ నిశ్చితార్ధ వేడుక జరగనుంది. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన కొద్ది మంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు ఉండటంతో అతి తక్కువ మంది మాత్రమే ఈ ఎంగేజ్ మెంట్‌కి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. రానా మిహీకా కుటుంబ సభ్యులు మాత్రమే ఎంగేజ్మెంట్కి హాజరు అవుతారని సమాచారం. ప్రస్తుతం రానా ఎంగేజ్మెంట్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైంలో ఆ ఫ్యామిలీతో వివాదాస్పదంగా సంబంధాలు కలుపుకున్న నటి శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఈ మధ్యే రానా-మిహీకాలకు శుభాకాంక్షలు తెలిపిన ఈ వివాదాల బ్యూటీ.. రానా నిశ్చితార్థం గురించి స్పందిస్తూ.. రానా బావకు పెళ్లి అంటూ పోస్ట్ చేసింది.

‘రానా బావకు ఎంగేజ్ మెంట్ ఈరోజే. రామానాయుడు స్టుడియోలో.. నెక్స్ట్ నాదే’ అంటూ కన్ను కొట్టే ఎమోజీతో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారమే రేపుతోంది. శ్రీరెడ్డికి రానా తమ్ముడు అభిరామ్‌తో రిలేషన్ ఉందని ఇదివరకే తెలిపింది. అంతేగాక గతంలో ఇద్దరు ఏకాంతంగా గడిపిన ఫొటోలు బయటపెట్టి చేసి వివాదాలకు తెరలేపింది. అభిరామ్‌తో తనకు ఉన్న రిలేషన్‌ని బయటపెట్టిన అమ్మడు.. వీలైన ప్రతిసారి దగ్గుబాటి ఫ్యామిలీతో రిలేషన్ కలుపుకుంటూ వస్తుంది. ఇక సురేష్ బాబుని మామా అని.. రానాని బావా అని.. వెంకటేష్‌ని చిన మామా అంటూ గతంలో కూడా వరసలు కలిపిన ఈ భామ.. తాజాగా రానా తమ్ముడి గురించి మాట్లాడకుండా.. రానా బావ పెళ్లి తర్వాత నెక్స్ట్ పెళ్లి నాదే.. అనడం పెద్ద సునామి కానుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home