BB3 ఫైనల్ ఎపిసోడ్ ఎఫెక్ట్.. శ్రీరెడ్డి రచ్చరచ్చ

0

నిన్న మొన్నటి వరకు కార్తీక మాసం పూజలు చేస్తున్నట్లుగా ఫేస్ బుక్ లో వీడియోలు మరియు ఫొటోలు పెట్టిన శ్రీరెడ్డి ఉన్నట్లుండి మెగా ఫ్యామిలీపై విరుచుకు పడింది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ను ఆ తర్వాత అప్పుడప్పుడు నాగబాబును విమర్శించిన శ్రీరెడ్డి ఈసారి చిరంజీవితో సహా మొత్తం మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియోలు మరీ దారుణంగా ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ ఆమె వీడియోలకు విపరీతమైన కామెంట్స్ పెడుతున్నా కొద్ది ఆమె మరింత రెచ్చి పోయింది.

ఉన్నట్లుండి మళ్లీ మెగా ఫ్యామిలీపై శ్రీరెడ్డికి కారణం ఏమై ఉంటుందా అంటూ చాలా మంది చర్చించుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ లో చిరంజీవి పాల్గొనడం ఆ సమయంలో తమన్నాను అభినందించినట్లుగా మాట్లాడటం జరిగింది. మనకు మాత్రమే తెలుసు అంటూ తమన్నాతో చిరంజీవి అన్న మాట సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. చిరు మనకు మాత్రమే తెలుసు అన్నా కూడా అది అందరికి తెలిసిన విషయమే అంటూ సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఇష్యూ మళ్లీ రేజ్ అయ్యింది.

బిగ్ బాస్ స్టేజ్ పై ఇండైరెక్ట్ గా చిరంజీవి తనను విమర్శించాడు అంటూ భావించిన శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీ అంతటిని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తుంది. చిరంజీవికి ఉన్న ఇమేజ్ వల్లే ఆయన బుద్ది.. ఆ కుటుంబంలో జరుగుతున్న చెడు అనేది బయటకు రావడం లేదంటూ ఆరోపించింది. శ్రీరెడ్డి వరుస వీడియోలతో మెగా ఫ్యామిలీ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసి మెగా ఫ్యాన్స్ కోపానికి కారణం అయ్యింది.

నాకు మా లో సభ్యత్వం రాకపోవడంకు కారణం చిరంజీవి.. నాకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి పోవడానికి కారణం చిరంజీవి అంటూ ఆరోపించింది. బూతులు తిడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ కు మంట పుట్టిస్తున్నాయి. ఈ వీడియోలు చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ నన్ను చంపేసినా ఆశ్చర్యం లేదంటూ ఆరోపించింది. చిరంజీవి సినీ రాజకీయ జీవితాలతో పాటు వ్యక్తిగత జీవితంకు సంబంధించిన విషయాలను కూడా తీసుకు వచ్చి శ్రీరెడ్డి వీడియోలో మాట్లాడింది.

ఇండస్ట్రీలో ఎంతో మందిని తొక్కేసిన ఘనత మెగా ఫ్యామిలీకి దక్కుతుందని.. ఎవరినైనా తొక్కేయాలంటే చిరంజీవి వద్ద నేర్చుకోవాలంటూ కామెంట్స్ చేసింది. చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి గురించి కూడా శ్రీరెడ్డి స్పందించి చాలా మంది బయ్యర్లకు నష్టాలు మిగిల్చారు అంది. మెగా ఫ్యామిలీలో ఉన్న వారంతా కూడా వక్రబుద్ది.. దొంగ బుద్ది ఉన్నవారే అంటూ వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి చిరంజీవి కోడలు ఉపాసన ఒక్కరే మంచి వారు అంది. శ్రీరెడ్డి విమర్శలపై మెగా కాంపౌండ్ ఏమైనా స్పందిస్తుందో చూడాలి.




Please Read Disclaimer