నాకాళ్లు పట్టుకుంటానని ఆమె కాళ్లు పట్టుకున్నాడు

0

రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక పార్టీ లో బ్యూటీఫుల్ హీరోయిన్ కాళ్లకు పడుకుని మరీ నమస్కారం చేసిన విషయం తెల్సిందే. వర్మ తాగిన మత్తులో అలా చేశాడంటూ సోషల్ మీడియా లో తీవ్ర దుమారం రేగుతోంది. తన సినిమా పబ్లిసిటీ కోసం వర్మ ఇంతకు దిగజారి పోవడం ఏంటంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మ అభిమానులు కూడా దీన్ని జీర్ణించుకో లేక పోతున్నారు. వర్మ దిగజారుడు తనం పీక్స్ కు చేరిందని.. మరీ ఇంతగా దిగజారి మరీ ప్రవర్తిస్తాడనుకోలేదు అంటూ ఆయన అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్మ చేసిన పనిపై నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ ఉంటే శ్రీరెడ్డి మాత్రం విభిన్నంగా అనుకుంది. ఆమె ఫేస్ బుక్ ద్వారా ఆ సంఘటన గురించి స్పందించింది. ఎప్పటికప్పుడు శ్రీరెడ్డి కూడా సంచలనాలకు తెర తీస్తూనే ఉంటుంది. అలాగే ఈసారి కూడా వర్మ చేసిన పనిపై స్పందిస్తూ.. వర్మ నన్ను చీట్ చేశాడు. గతంలో నన్ను దేవత అన్నాడు. అప్పట్లో నా కాళ్లు పట్టుకుంటా అన్నాడు. నన్ను అందాల దేవత అన్నాడు. ఇప్పుడేమో ఆమె కాళ్లు పట్టుకున్నాడు. వర్మ చేసిన పనికి నేను హర్ట్ అయ్యాను అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.

గతంలో శ్రీరెడ్డి విషయం వివాదాస్పదం అయిన సందర్బంలో రామ్ గోపాల్ వర్మ వెనుక ఉన్నాడు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అప్పుడు వర్మ చెప్పినట్లుగా శ్రీరెడ్డి ప్రవర్తిస్తుందని కూడా ప్రచారం జరిగింది. శ్రీరెడ్డి మరియు రామ్ గోపాల్ వర్మలు సోషల్ మీడియా లో చేస్తున్న పోస్ట్ లు కొందరిని ఇబ్బంది పెడుతున్నా చాలా మందిని ఎంటర్ టైన్ చేస్తున్నాయంటూ సోషల్ మీడియా లో జనాలు అనుకుంటున్నారు.
Please Read Disclaimer