దొరసాని లిప్పు లాకుల సంగతేంటి అంటున్న శ్రీరెడ్డి!

0

శ్రీరెడ్డి హంగామా అంతా ముగిసిపోయిందని అనుకునేసరికి ఏదో ఒక వీడియో పోస్ట్ చేసి లేదా ఎవరైనా సెలబ్రిటీలపై వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతుంది. కొద్ది రోజుల క్రితం విశాల్ పై తీవ్ర విమర్శలు చేసి అందరినీ ఆకర్షించిన శ్రీ రెడ్డి తాజాగా సీనియర్ నటి జీవితపై ఫోకస్ చేసింది. శ్రీరెడ్డి.. జీవితల మధ్య గతంలో విమర్శలు ప్రతి విమర్శల ఎపిసోడ్స్ రెండు మూడు సార్లు జరిగిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి అప్పట్లో జీవితపై ఘాటు విమర్శలు చేసింది.

వారిద్దరి మధ్య జరిగిన అప్పటి గోలను పక్కన పెట్టి ప్రస్తుతం గురించి మాత్రమే మాట్లాడుకుంటే శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా రీసెంట్ గా లైవ్ చాట్ చేసింది. అందులో ‘దొరసాని’ సినిమాలో లిప్పు లాకులను ప్రస్తావిస్తూ జీవితపై విరుచుకుపడింది. జీవిత కొన్ని రోజుల క్రితం ‘డిగ్రీ కాలేజ్’ అనే సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. ఆ ట్రైలర్ ను చూసిన తర్వాత స్టేజ్ మీదనే మేకర్స్ కు ఆ సినిమాలోని లిప్పు లాకులపై క్లాస్ తీసుకున్నారు. బెడ్ రూమ్ లో చేసుకునే విషయాలను నలుగురి మధ్య చేయకూడదని భారీ సంప్రదాయాల ఫిలాసఫీ చెప్పారు. ఆ విషయాన్ని శ్రీరెడ్డి ప్రస్తావిస్తూ.. జీవితగారు నీతులు పక్క వాళ్ళకే చెప్తారా.. తన కూతురు శివాత్మిక నటించిన ‘దొరసాని’ సినిమాలో లిప్ లాకులు ఉన్నాయి కదా.. మరి ఆమె చెప్పిన ఫిలాసఫీ కూతురు సినిమాకు వర్తించదా అంటూ ఒక పవర్ఫుల్ లాయర్ లాగా ప్రశ్నించింది.

శ్రీరెడ్డి చెప్పిన పాయింట్ కు చాలామంది నెటిజన్లు మద్దతు తెలిపారు. ప్రవచనకర్తలాగా పక్కన వాళ్ళకు నీతులు చెప్పడం.. క్లాసులు పీకడం చాలా సులువు అని.. అదే తన వరకూ వస్తే కానీ తత్త్వం బోధపడదని జీవితపై సోషల్ మీడియాలో పంచ్ లు పడిపోతున్నాయి. ‘దొరసాని’ లో ఆ లిప్ లాక్ అవసరమా కదా.. అది కళాత్మకమా అనేది కాదు ఇక్కడ ప్రశ్న.. జీవిత ‘డిగ్రీ కాలేజ్’ వారికి పీకిన క్లాస్ లో కనీసం పదో శాతం అయినా ‘దొరసాని’ టీమ్ కు పీకితే ఎవరైనా జీవితగారు ‘చెప్పేదే చేస్తారని.. చేసేదే చెప్తారని’ ఒప్పుకుంటారు! లేకపోతే ఇలాంటి విమర్శలు తప్పవు.
Please Read Disclaimer