శ్రీదేవిని డీగ్రేడ్ చేస్తున్నారా?

0

ఒకే ఒక్క కన్నుగీటుతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ తొలి ప్రయత్నమే సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. ప్రియా నటించిన లవర్స్ డే (ఒరు ఆడార్ లవ్) సక్సెస్ కాకపోయినా.. వింక్ గాళ్ గా తనకు వచ్చిన ఇమేజ్ ని తెలివిగా క్యాష్ చేసుకుంటోంది. ద్వితీయ ప్రయత్నమే ఈ అమ్మడు `శ్రీదేవి బంగ్లా` అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తూ వేడెక్కిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ తొలి టీజర్ వివాదాస్పదం అయ్యాయి. శ్రీదేవి బంగ్లా తొలి టీజర్ లో అతిలోక సుందరి శ్రీదేవి మిస్టీరియస్ డెత్ ని తలపించే విజువల్స్ తో ప్రశ్నల్ని రేకెత్తించింది టీమ్. శ్రీదేవి డెత్ మిస్టరీ నేపథ్యంలో ఒక వివాదాస్పద ఎలిమెంట్ ని ఎంపిక చేసుకుని ఈ సినిమా తీస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినిమా పేరుతో అతిలోక సుందరి శ్రీదేవి క్యారెక్టర్ ని డీగ్రేడ్ చేసి చూపించే ప్రయత్నం సాగుతోందా? అంటే అవుననే తాజాగా రివీలైన రెండో టీజర్ అనుమానాలని రేకెత్తిస్తోంది. మరోవైపు ప్రియా వారియర్ ఆహార్యం వస్త్రధారణ సహా ప్రతిదీ శ్రీదేవిని ఇమ్మిటేట్ చేసే ప్రయత్నం ఇప్పటికే రిలీజైన పోస్టర్లలో కనిపిస్తోంది.

ఒక జాతీయ స్థాయి నటిగా ఎదిగిన మామ్ శ్రీదేవి తెలుగు తమిళం హిందీలో అగ్ర కథానాయికగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. నిర్మాత బోని కపూర్ ని పెళ్లాడి ఇద్దరు బిడ్డల తల్లిగా బాధ్యతాయుతమైన మామ్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. రంగుల ప్రపంచంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అనూహ్యమైన పరిస్థితిలో బోనీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఆ జర్నీలో ఓ కొత్త పాయింట్ ని శ్రీదేవి బంగ్లా చిత్రంలో టచ్ చేస్తున్నారా? అంటే తాజాగా రిలీజైన టీజర్ అందుకు సంబంధించిన హింట్ ని ఇచ్చింది.

“నాకు ఎంత మంది ప్రపోజ్ చేశారో నీకు తెలుసా? అని ప్రియా (శ్రీదేవి పాత్రధారి) ఓ కుర్రాడిని టీజర్ లో ప్రశ్నిస్తోంది. ఆ డైలాగ్తో టీజర్ మొదలైంది. ‘దునియా మొత్తం నీ న్యూడ్ లైఫ్ చూస్తుంది’ అని ప్రియాని ఓ వ్యక్తి బెదిరించటం కనిపిస్తోంది. ఇదంతా ఫిక్షనా.. లేక శ్రీదేవి లైఫ్ లో ఇన్సిడెంట్ ని చూపిస్తున్నారా? అంటూ అభిమానుల్లో కన్ఫ్యూజన్ కి కారణమైంది. ఇది ఆశ్చర్యాన్ని కల్గించేలా ఉంది. అలాగే శ్రీదేవిని ఒక అపరిచితుడు వెంటాడే సన్నివేశాన్ని చూపించి టీజర్ లో సస్పెన్స్ ని మెయింటెయిన్ చేయడం వేడెక్కిస్తోంది. ప్రశాంత్ మాంబుల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆరాత్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే రిలీజ్ కి వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే కోర్టు కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి బంగ్లా ఇంకా ఎన్ని వివాదాల్ని మోసుకొస్తుందోనన్న సందేహాలు రెయిజ్ అవుతున్నాయి ఇప్పటికి. ఇలా ఉన్నవి లేనివి కల్పించి ఫిక్షన్ తో కమర్షియల్ సక్సెస్ కోసం తమ అభిమాన తార శ్రీదేవి క్యారెక్టర్ ని డీగ్రేడ్ చేసి చూపిస్తే సహించేందుకు అభిమానులు సిద్ధంగా ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు.
Please Read Disclaimer