సాక్షాత్తూ శ్రీదేవికి ప్రతిరూపం.. జాన్వీ కానే కాదు!

0

అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మికమరణం సంచలనమైన సంగతి తెలిసిందే. ఆ మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేరు. ఇప్పటికే రెండేళ్లవుతోంది. అభిమానులు మామ్ ని తలవని సందర్భమే లేదు. ఇటీవల బోనీకపూర్- జాన్వీ కపూర్ బృందం సింగపూర్ మ్యాడమ్ తుస్సాడ్స్ లో శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

ఇక అది పాత విషయం అనుకుంటే.. ఇప్పుడు సడెన్ గా ఓ యంగ్ శ్రీదేవి జనాల కంటికి కునుకు కరువయ్యేలా చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎక్కడి నుంచి ఈవిడ దిగొచ్చింది? శ్రీదేవి మళ్లీ జన్మించిందా? అంటూ కొత్త డిబేట్ కి తావిచ్చిందంటే సదరు యంగ్ శ్రీదేవి ఎంతగా అభిమానులకు కనెక్టయ్యిందో అర్థం చేసుకోవచ్చు. టిక్ టాక్ పుణ్యమా అని ఈ అభినవ శ్రీదేవి ప్రస్తుతం వైరల్ గా మారింది.

అచ్చంగా శ్రీదేవిని తలపించేలా కనిపిస్తున్న ఈ యువతి ఎవరో కానీ టిక్ టాక్ లో మాయ చేస్తోంది. తానే క్షణక్షణం శ్రీదేవి అన్నంతగా వీడియోలతో మురిపిస్తోంది. ఇంతకీ ఎవరీవిడ అని ఆరాతీస్తే పేరు రాఖీ. టిక్టాక్ ఆర్టిస్ట్ గా వీడియోలతో సంచలనాలు సృష్టించడం ఆవిడ పని. ప్రస్తుతం ఈ అభినవ శ్రీదేవి వీడియోలు అంతర్జాలాన్ని కుదిపేస్తున్నాయి. క్వీన్ రాఖీ పేరుతో టిక్ టాక్ వీడియోలు ప్రస్తుతం అంతర్జాలాన్ని కుదిపేస్తున్నాయి. శ్రీదేవి నటించిన పలు ప్రముఖ చిత్రాల్లోని నటనను ఇమ్మిటేట్ చేస్తోంది రాఖీ. చాల్బాజ్- నాగిని- హిమ్మత్వాలా పాటల్ని.. కొన్ని డైలాగ్స్ ని టిక్ టాక్ లో ప్రదర్శించి ఆకట్టుకుంటోంది. ఆవిడ వ్యవహారం చూస్తుంటే మునుముందు ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించేట్టే కనిపిస్తోంది. తన ఫేవరెట్ శ్రీదేవిని పోలిన ఈ అమ్మడు ఇంకా ఆర్జీవీ కళ్లలో పడలేనట్టుంది. పడి ఉంటే ఈపాటికే భారీ ఆఫర్ దక్కి ఉండేదేమో!!
Please Read Disclaimer