బిగ్ బాస్ 3 : పోలీసుల నోటీసుకు స్టార్ మా స్పందన

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ఆరంభంకు ముందే శ్వేతా రెడ్డి మరియు గాయత్రి గుప్తల కారణంగా పోలీసు కేసును ఎదుర్కొన్న విషయం తెల్సిందే. బిగ్ బాస్ షో కు ఎంపిక చేసేందుకు తమను ఇంటర్వ్యూ చేసి ఆ సమయంలో మమ్ములను లైంగికంగా వేదించారు అంటూ వీరిద్దరు పోలీసులకు ఇచ్చిన కేసులో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఇటీవలే స్టార్ మా టీవీ యాజమాన్యంకు నోటీసులు జారీ చేయడం జరిగింది. బిగ్ బాస్ షో కోసం పార్టిసిపెంట్స్ ఎంపిక చేసే వారు ఎవరు? వారిద్దరు ఆరోపిస్తున్న రఘు.. రవికాంత్ లకు ఈ షో సంబంధం ఏంటీ అనే కొన్ని ప్రశ్నలను పోలీసులు నోటీసుల్లో స్టార్ మాటీవీని అడగడం జరిగింది.

తాజాగా పోలీసులు ఇచ్చిన నోటీసుకు స్టార్ మా టీవీ సమాధానం ఇచ్చింది. బిగ్ బాస్ షో కు నిర్మాతలు ఎండెమాల్ సంస్థ వారు. ఇక బిగ్ బాస్ 3 ప్రెసిడెంట్ గా శ్యామ్ శంకర్ వ్యవహరిస్తున్నారు. షో క్రియేటివ్ కన్సల్టెంట్ గా అభిషేక్.. మేనేజర్ గా రవికాంత్.. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా రఘులు ఉన్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక విధానంలో డాక్టర్ లతో పాటు మానసిక నిపుణులను కూడా తాము వినియోగిస్తామని 100 మంది ధరకాస్తులను తిరష్కరించినట్లుగా స్టార్ మా పేర్కొంది.

స్టార్ మా సమాధానం పరిశీలించిన పోలీసులు తిరష్కరించబడ్డ 100 మంది జాబితాను కోరడం జరిగింది. స్టార్ మా ఆ జాబితాను రెండు మూడు రోజుల్లో పోలీసులకు ఇచ్చే అవకాశం ఉంది. జాతీయ మహిళ కమీషన్ ఈ కేసు విషయమై ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కారణంగా విచారణ వేగంగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer