డబ్బుల విషయంలో మోసం.. శ్రీహరి భార్య డిస్కో శాంతి ఎమోషనల్

0

శ్రీహరి మరణించి ఏడేళ్లు అవుతున్నా ఆయన జ్ఞాపకాలు వీడిపోలేదని ఆయన భార్య నటి డిస్కో శాంతి కంటతడి పెట్టారు. వీరిద్దరి కొడుకు మేఘాంశ్ రెండో సినిమా ‘కోతి కొమ్మచ్చి’ మూవీని ప్రారంభించిన అనంతరం డిస్కో శాంతి మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.

శ్రీహరి చనిపోయినా.. ఇప్పటికే ఆయన పేరుతో అనాథాశ్రమాలకు అన్నదానం.. పెద్దమ్మగుడిలో అన్నదానం కొనసాగిస్తున్నామని అన్నారు. అవతలివాళ్లు సంతోషంగా ఉన్నారు అది చాలు అని డిస్కో శాంతి అన్నారు. ఉన్నంతలో తాము సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

శ్రీహరి గారు బతికున్నప్పుడు చాలా మందికి డబ్బులు ఇచ్చారని.. ఆయన పోయాక అడిగితే డబ్బులు ఇచ్చేది లేదని కొందరు అన్నారని డిస్కో శాంతి వాపోయారు. మాకే ఇచ్చేది లేదన్నారని.. అడిగితే మాత్రం శ్రీహరి గారే మాకు ఇవ్వాలని చెబుతున్నారని ఆమె అన్నారు. అలా అన్నవారే ఇప్పుడు ఏమీ లేకుండా పోయారని డిస్కో శాంతి మండిపడ్డారు.

డబ్బుల విషయంలో చాలా మోసపోయామని.. చాలా మంది తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదని శాంతి అన్నారు. శ్రీహరి చనిపోయాక ప్లేటు ఫిరాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము ఆర్థికంగా సంతోషంగానే ఉన్నామని ఆమె తెలిపారు.