ట్రైలర్ టాక్: శ్రీమతి 21 F

0

టాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ సినిమాల ప్రవాహం ఆగడం లేదు. కొత్తగా ఈ లిస్టులో జాయిన్ అయ్యేందుకు వస్తున్న చిత్రం ‘శ్రీమతి 21F’. తమిళంలో ‘టార్చ్ లైట్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘శ్రీమతి 21F’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ‘జయం’.. ‘అపరిచితుడు’ లాంటి సినిమాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సదా ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్ నిన్నే రిలీజ్ అయింది. ఈ చిత్రానికి అబ్దుల్ మజీత్ దర్శకత్వం వహించారు. .. ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 1 న రిలీజ్ కానుంది.

ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పుకుంటే ఒక వేశ్య జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించారట. 1990లో ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు బోర్డర్ దగ్గరలోని హైవేలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని ఫిలిం మేకర్స్ అంటున్నారు. తమిళంలోఈ సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు. ఎందుకంటే ఈ సినిమాలో వేశ్యలు హైవే పక్కన విటుల కోసం టార్చ్ లైట్ పట్టుకుని నిలుచుంటారు. సబ్జెక్ట్ కు తగ్గట్టే ట్రైలర్ లో డైలాగులు పూర్తిగా బరితెగించినట్టుగా ఉన్నాయి. “జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా?”.. “నువ్విచ్చే రెండు వందల రూపాయలకు నిన్ను రెచ్చగొట్టమంటావా?” ఇలా పూర్తిగా రెచ్చిపోయారు.

ట్రైలర్ చూస్తే మరీ C – గ్రేడ్ సినిమా లాగా ఉంది. విజువల్స్ పరమ నాసిరకంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోరు బీసీ కాలం నాటిది. ఈ ట్రైలర్ లో ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఆకట్టుకునేలా లేకపోవడం ఒక మేజర్ హైలైట్. ట్రైలర్ చూసేయండి. ఇలాంటి ట్రైలర్లు చూస్తేనే మంచి సినిమాల విలువ.. మంచి ట్రైలర్ల విలువ తెలుస్తుంది.
Please Read Disclaimer