స్నేహితుల నమ్మకాన్ని గెలిపించాడా లేదా?

0

పరిశ్రమకు ఎందరో దర్శకులవ్వాలని వచ్చి నటులు అయిన వాళ్లున్నారు. నటుడు అయ్యాక దర్శకుడిగా మారిన వాళ్లు ఉన్నారు. ఇక నటులు .. దర్శకులు నిర్మాతలుగా సినిమాలు చేసి మిక్స్ డ్ రిజల్ట్ అందుకున్న వాళ్లు ఉన్నారు. అయితే మెజారిటీ భాగం సినీపరిశ్రమలో పెట్టేది అంతా రిస్కేనని అనుభవజ్ఞులు చెబుతుంటారు.

మరి అలా అయితే కమెడియన్ టర్న్ డ్ హీరో.. డైరెక్టర్ కం నిర్మాత శ్రీనివాస్ రెడ్డి సన్నివేశమేంటి? చిన్న సినిమాలతో కమెడియన్ గా మొదలై అటుపై తన శరీరభాషకు తగ్గ కథల్ని ఎంచుకుని చక్కని కామెడీ హీరోగా రాణించిన శ్రీనివాస్ రెడ్డి దర్శకనిర్మాతగా మారి రూపొందించిన `భాగ్యనగరములో గమ్మత్తు` ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. అయితే ఒకేరోజు మూడు నాలుగు సినిమాలతో పోటీపడి రిలీజైన ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ ని అందుకోబోతోంది.

ఈ సినిమా కోసం స్నేహితుల సహాయం తీసుకున్నా 3-4కోట్ల మేర సొమ్ముల్ని వెదజల్లి నిర్మాతగా శ్రీనివాస్ రెడ్డి చాలా పెద్ద సాహసమే చేశారు. అంత డబ్బు పెట్టాలంటే ఒక సాధారణ నటుడికి ఎన్ని గట్స్ ఉండాలి? అయినా ఆ సాహసం చేసేశాడు. మరి కాయా పండా? జయాపజయాల మాటేమిటి? పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసినా డెబ్యూగా అతడి ప్రయత్నం ఫలించినట్టే. ఇదే హుషారులో మరిన్ని కామెడీ సినిమాల్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ పది మంది కమెడియన్లకు అవకాశాలు కల్పించే వీలుంటుంది. `ఫ్లయింగ్ కలర్స్` పేరుతో కమెడియన్లు అంతా కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి స్నేహితులుగా ఒక కొత్త కల్చర్ కి తెర తీశారు. ఈ గ్రూప్ లో ఎవరు సినిమా తీస్తున్నా ఇతర కమెడియన్ల సాయం ఉంటుంది. అలా తీసిన చిత్రమే భాగ్యనగరం వీధుల్లో గమ్మత్తు. డబ్బు.. హత్య.. క్రైమ్ అంటూ ఆసక్తికరమైన జోనర్ తోనే తెరకెక్కింది. ఈ సినిమా సింగిల్ లైన్ అద్భుతంగా కుదిరిందని.. ఈ చిత్రంలో నటించిన శ్రీనివాస్ రెడ్డి సహా సత్య- షకలక శంకర్ అదిరిపోయే కామెడీ చేశారన్న టాక్ అయితే వచ్చింది. మధ్యలో కొన్ని స్పూఫ్ లు బాగా పేలాయన్న ప్రశంసలు ఆడియెన్ నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ బాక్సాఫీస్ కలెక్షన్లుగా మారాయా లేదా? అసలు ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండనుంది? అన్నది సోమవారం నాటికి కానీ తేలదు.
Please Read Disclaimer