మోడరన్ దేవదాస్ దర్శకుడు జాడేది?

0

గత ఏడాది బాగా క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటిగా వచ్చిన మల్టీ స్టారర్ దేవదాస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే . నాగార్జున నానిలు మొదటిసారి కాంబోగా వచ్చినా యావరేజ్ అనిపించుకుందే తప్ప సూపర్ హిట్ కాలేకపోయింది . దాని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అప్పటి నుంచి ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ దేవదాస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుంటే ఈపాటికి నిర్మాతల క్యు చాంతాడంత ఉండేది.

అలా అని అసలు ఆఫర్స్ లేకుండా పోలేదని కాదు కాని మునుపటి దూకుడు అయితే కనిపిస్తున్నట్టు లేదు. ఏదో ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ఆ మధ్య కొంత ప్రచారం జరిగింది తర్వాత అలాంటిది ఏమి లేదని తేలిపోయింది. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఓ హీరోతో కాంబినేషన్ సెట్ చేసుకుని నిర్మాతతో ఓకే చేయించుకున్నాడని టాక్ వచ్చింది కాని అదీ డైలమా స్టేజిలోనే ఉందట.

శ్రీరామ్ ఆదిత్య మొదటి సినిమా భలే మంచి రోజు మంచి సక్సెస్ అందుకుని పేరు తెచ్చింది. తర్వాత నలుగురు యూత్ హీరోలతో చేసిన శమంతకమణి పర్వాలేదు అనిపించుకుంది. కాని మొదటిసారి ఇద్దరు స్టార్లను ఒకేసారి డీల్ చేయడంలో శ్రీరామ్ తడబడటం ఫలితాన్ని ప్రభావితం చేసింది. ఇంకో రెండు నెలల్లో అది విడుదలై ఏడాది పూర్తవుతుంది. ఆలోగా ఏదైనా సెట్ చేసుకుంటాడో లేకా ఇంకొంత కాలం వెయిటింగ్ ఉండాల్సి వస్తుందో వేచి చూడాలి.
Please Read Disclaimer