బన్నీని కూడా వదిలి పెట్టని శ్రీ రెడ్డి

0

సోషల్ మీడియా వేదికలు ఫేస్ బుక్ ట్విట్టర్.. యూట్యూబ్ అందరికీ అందుబాటులోకి రావడం .. ఈ వేదికలపై సంపాదనకు ఆస్కారం లభించడం కొన్ని ప్రకోప వికోపాలకు తావిస్తోందన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. పలు యూట్యూబ్ చానెళ్ల వేదికగా వివాదాస్పద నటి శ్రీ రెడ్డి నిరంతరం స్టార్లను టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్లను గుప్పిస్తుండడం.. అవి కాస్తా వైరల్ అయిపోతుండడం తెలిసిందే. ఇంతకు ముందు పలువురు నిర్మాతలు సహా హీరోల పైనా శ్రీ రెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పలువురిపై మీటూ ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఫేస్ బుక్ వేదికగా శ్రీ రెడ్డి చేసిన ఓ కామెంట్ అంతే వైరల్ అయిపోతోంది.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై శ్రీరెడ్డి కామెంట్లు చేయడం అభిమానుల కోపానికి కారణమైంది. అంతగా ఆవిడ ఏం కామెంట్ చేశారు? అంటే.. “ అల్లు అర్జున్ ఎప్పటికైనా నీ ఒరిజినల్ హెయిర్ తో సినిమాల్లో వస్తావా? ఎప్పుడూ ఎక్స్టెన్షన్ విగ్గులేనా?“ అంటూ శ్రీ రెడ్డి ఫేస్బుక్ లో కామెంట్ ను పోస్ట్ చేసింది. దీనికి కౌంటర్ గా బన్ని అభిమానులు సోషల్ మీడియాల్లో చెలరేగారు.

ఎప్పుడూ ఇలాంటి చీఫ్ ట్రిక్స్ తప్ప ఇంకోటి తెలియదా నీకు? అని బన్ని ఫ్యాన్స్ సీరియస్ అవ్వడం కనిపిస్తోంది. అల వైకుంఠపురములో సినిమా కోసం బన్ని ఓ ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ ని అనుసరించారు. కాస్త మాస్ స్టైల్ ఉన్నా స్పెషల్ లాంగ్ హెయిర్ లుక్ తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇంతకుముందు కేరళ వరదల వేళ శ్రీరెడ్డి బన్నిపై ఎలాంటి కామెంట్లు చేసిందో తెలిసిందే. అయితే అప్పట్లోనే బన్ని కేరళ సీఎం నిధికి విరివిగా విరాళాలు ప్రకటించారు. ప్రస్తుతం అల వైకుంఠపురములో రిలీజ్ కి రెడీ అవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది.
Please Read Disclaimer