విశాల్ ను టార్గెట్ చేస్తున్న వివాదాస్పద నటి

0

గత కొన్ని రోజులుగా హీరో విశాల్‌కు దర్శకుడు మిస్కిన్కు మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. అంతకు ముందు వీరిద్దరి కలయికలో వచ్చిన తుప్పరివాలన్ సినిమా ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో డిటెక్టివ్ పేరు తో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. చిత్ర నిర్మాతైన విశాల్ ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు. బడ్జెట్ వల్ల ఇరువురి మధ్య తలెత్తిన వివాదాల కారణంగా మిస్కిన్‌ను తొలగించి తానే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసిన విశాల్ దర్శకుడిగా మిస్కిన్‌ను తొలగించడానికి గల కారణాలను లేఖ రూపంలో వివరించాడు.

ఒకరి ప్రతిష్టకు భంగం కలిగించాలనేది తన ఉద్దేశ్యం కాదని నిర్మాతల కష్టాలు కొత్తగా వచ్చే నిర్మాతలు తెలుసుకుంటారని చెబుతున్నానంటూ పేర్కొన్నాడు. ఇలా మరో నిర్మాతకు ఎదురు కాకూడదని మధ్యలో చిత్రాన్ని వదిలేయలేక తానే దర్శకత్వం వహిస్తున్నానని తెలిపాడు. తనను తుప్పరివాలన్ 2 నుంచి తప్పించడంపై మిస్కిన్ కూడా విశాల్ పై కౌంటర్లు వేశాడు. తాను సినిమాలోని ఒక్క యాక్షన్ సీక్వెన్స్‌కు 400 కోట్లు అడిగానని వ్యగ్యంగా కామెంట్స్ చేశాడు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ వివాదంలోకి శ్రీ రెడ్డి ఎంటరైంది. తన మద్దతు ఎల్లప్పుడూ దర్శకులకే ఉంటుందని ఈసారి తన సపోర్ట్ మిస్కిన్కేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా విశాల్‌ను టార్గెట్ చేస్తూ ఇంత డబ్బు ఎలా సంపాదించావంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.

విశాల్ రెడ్డి – శ్రీ రెడ్డి మధ్య ఉన్న గొడవ ఇప్పటిది కాదు. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ మీటూ ఉద్యమం లో భాగంగా విశాల్‌పై ఆరోపణలు చేసి సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విశాల్ కు మిస్కిన్కు మధ్య వివాదంలోకి దూరి మళ్ళీ వార్తల్లో నిలిచింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-