మెగా ఫ్యామిలీ హవా అలా ఉంది మరి!

0

సంక్రాంతి సినిమాలు విడుదల తర్వాత బాక్స్ ఆఫీసు రికార్డులపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొత్త సినిమాలు వచ్చేకొద్ది పాత సినిమాలు రికార్డుల లిస్టు నుంచి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఇలా రికార్డు లిస్టులో మార్పులు జరగడం సాధారణం. తాజాగా ఆల్ టైమ్ టాప్-5 చిత్రాల జాబితా ఆసక్తి కరంగా మారింది.

ఎప్పటిలాగే మొదటి రెండు స్థానాల్లో బాహుబలి 2.. బాహుబలి 1 నిలిచాయి. తర్వాత మూడు స్థానాలు మెగా ఫ్యామిలీ హీరోలవే కావడం గమనార్హం. ‘అల వైకుంఠపురములో’.. ‘రంగస్థలం’.. ‘సైరా’ లు టాప్ 5 లిస్టులో ఉన్నాయి. దీన్ని బట్టి బాక్స్ ఆఫీసుపై మెగా ఫ్యామిలీ హీరోల హవా ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ లిస్టులో మార్పుచేర్పులు జరగాలంటే రాజమౌళి ‘RRR’ రిలీజ్ కావాల్సిందే. సాధారణ సినిమాలు నాన్-బాహుబలి సెక్షన్లో టాప్ గా నిలవగలవు కానీ బాహుబలి స్థానాలను కదిలించలేవు. ఆ సత్తా ‘RRR’ కు మాత్రమే ఉందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

బాక్స్ ఆఫీసు రికార్డులు అనగానే మొదటి నుంచి మెగా హీరోల డామినేషనే ఎక్కువగా ఉండేది. అయితే ‘బాహుబలి’ ఫ్రాంచైజీ రావడంతో ఆ ఆధిపత్యానికి గండిపడింది. అయితే బాహుబలి తర్వాత స్థానాలు మాత్రం మెగా హీరోల సినిమాల పేరిటే ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ పై మెగా ఫ్యామిలీ పట్టు కొనసాగుతూనే ఉంది కానీ ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టడం మాత్రం మెగా హీరోలకు సాధ్యం కావడం లేదు.
Please Read Disclaimer