ఆ విషయం రహస్యంగా ఉంచడమే ఇష్టం

0

క్రేజీ బ్యూటీ శ్రీయ గత ఏడాది రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.. వ్యాపారవేత్త ఆండ్రూ కోశ్చీవ్ ని ప్రేమించి రహస్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం జరిగి ఏడాది పూర్తయినా తన పెళ్లి విషయాన్ని మీడియాకు గానీ ప్రపంచానికి గానీ చెప్పడానికి శ్రియ ఇష్టపడలేదు. రాజస్థాన్ లో డెస్టినేసన్ వెడ్డింగ్ తరహాలో జరిగిన ఈ వివాహానికి ఇరు కటుంబాలకు సంబంధించిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

పెళ్లికి వచ్చిన వారు కూడా శ్రియ అభిప్రాయం మేరకు నడుచుకుని గోప్యతను పాటించారు. దాంతో శ్రియ పెళ్లికి సంబంధించిన ఒకే ఒక్క ఫొటో తప్ప మరే ఫొటోలు బయటికి రాలేదు. గత కొన్ని నెలలుగా తన రహస్య వివాహం గురించి స్పందించని శ్రియ తాజాగా స్పందించింది. `నేనూ ఆండ్రీ వివాహం చేసుకుని దాదాపు రెండేళ్లవుతోందన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇందులో దాయడానికి ఏమీ లేదు. అయితే నేనే నా జీవితాన్ని తెలియకుండా వుంచుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతాను. నేను ఎక్కువగా పనిచేస్తూ వుంటే ఆయన ఆనందిస్తుంటారు` అని తన సీక్రెట్ పెళ్లిపై రెండేళ్ల తరువాత క్లారిటీ ఇచ్చింది.

విదేశీయుడిని వివాహం చేసుకున్న శ్రియ నటనకు ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టకుండా యధావిదిగా కొనసాగిస్తోంది. గత ఏటడాది ఎన్.టీ.ఆర్ జీవిత కథలో నటించిన శ్రియ తెలుగు- తమిళ- హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూనే వున్నారు. ప్రకాష్ రాజ్ డైరెక్ట్ చేస్తున్న బాలీవుడ్ చిత్రం `తడ్కా`లో శ్రియ నటిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ కాబోతోంది.
Please Read Disclaimer