స్టార్ హీరో కూతురు అఫైర్స్ ను ఒప్పుకుంది

0

టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ మూడు భాషల్లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు మల్టీ ట్యాలెంట్ అమ్మాయిగా గుర్తింపు దక్కించుకుని తండ్రి కమల్ హాసన్ కు తగ్గ కూతురు అని నిరూపించుకున్న శృతి హాసన్ గత కొన్ని రోజులుగా సినిమాలకు కాస్త దూరం మెయింటెన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడే సింగర్ గా పలు షోలు చేసింది. మళ్లీ ఇప్పుడు హీరోయిన్ గా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

శృతి హాసన్ హీరోయిన్ గా కెరీర్ ఆరంభించక ముందు నుండే ఆమె గురించి రకరకాల పుకార్లు ఉండేవి. ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పలువురితో లవ్ అఫైర్స్ అంటూ వార్తలు వచ్చాయి. వాటిల్లో ఏ ఒక్క దాని గురించి పెద్దగా స్పందించని శృతి హాసన్ ఆమద్య లండన్ వ్యక్తితో ప్రేమలో పడ్డట్లుగా ప్రచారం జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఆ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కాని ఏమయ్యిందో ఏమో కాని ఇద్దరు విడిపోయారు. ఇద్దరు కూడా స్నేహితులుగా కొనసాగుతూ ప్రేమికులుగా విడిపోవాలని అనుకున్నారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో తన ప్రేమ విషయాల గురించి శృతి హాసన్ మాట్లాడుతూ ప్రేమలో ఉన్నప్పుడు బయటకు చెప్పాలంటే అప్పట్లో బయపడేదాన్ని. ప్రేమిస్తున్నాను అనగానే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయం నాలో ఉండేది. మొదటి సారి ప్రేమలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. ఇద్దరి మద్య కొన్ని విభేదాలు.. అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయాం. రెండవ సారి ప్రేమలో పడ్డప్పుడు మాత్రం నేను నా ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచాలని నేను అనుకోలేదు. అతడి గురించి అందరికి తెలిసింది. మీడియాలో కూడా వార్తలు వచ్చినా నేను పట్టించుకోలేదు. అతడితో జీవితం పంచుకోవాలనుకున్నాను. బయటకు తెలిస్తే వచ్చే సమస్య ఏంటని నేను ఆ సమయంలో అనుకున్నాను.

జీవితాంతం అతడితో ఉండాలని భావించిన నేను అలా కుదరదని భావించి అతడికి దూరం అయ్యాను. అతడితో బ్రేకప్ అయినందుకు బాధ లేదని చెప్పిన శృతి హాసన్ భవిష్యత్తులో మళ్లీ ప్రేమలో పడను అని చెప్పలేనంటూ ఇప్పుడే మళ్లీ ప్రేమించబోతున్నట్లుగా క్లూ ఇచ్చేసింది. మరి శృతి మూడవ బాయ్ ఫ్రెండ్ అయినా ఆమెకు భర్త అవుతాడో చూడాలి.
Please Read Disclaimer