టాలీవుడ్ పై బిగ్ స్కెచ్ వేసిందట!

0

కమల్ హాసన్ వారసురాలిగా కెరీర్ ప్రారంభించినా పరిశ్రమలో తనదైన మార్క్ వేసింది అందాల శృతిహాసన్. కెరీర్ తొలి నాళ్లలో ఎంతో హార్డ్ వర్క్ చేసింది. వరుస అఫర్లతో క్షణం తీరిక లేకుండా ఎడా పెడా సినిమాలు చేసేసింది. హిందీ చిత్రం `లక్`తో తెరంగేట్రం చేసి అది లక్ ను ఇవ్వకపోయినా టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ ఇచ్చిన ఊపు అంతా ఇంతా కాదు. అటుపై తెలుగు-తమిళం- హిందీన లో వరుస ఆఫర్లని సొంతం చేసుకుంది. అయితే ఆ తరువాత మాంచి ఫామ్ లోకి వస్తుందనుకున్న శృతిహాసన్ క్రమ క్రమంగా సినిమాలు తగ్గించుకోవడం మొదలుపెట్టింది. గత కొంత కాలంగా వ్యక్తిగత కారణాలు.. మానసిక ఒత్తిడి.. ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా వుంటూ వచ్చింది.

బాయ్ ఫ్రెడ్ తో బ్రేకప్ తరువాత మళ్లీ సినిమాల పరంగా జోరు పెంచింది. తమిళంలో విజయ్ సేతుపతి నిర్మాతగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన శృతి ఆ సినిమా అండర్ ప్రొడక్షన్ లో వుండగానే మళ్లీ వరుస ఆఫర్లని సోంతం చేసుకుంటూ యమ బిజీ అయిపోతోంది. తాజాగా తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న `కిరాక్` చిత్రాన్ని అంగీకరించింది. గోపీచంద్ మలినేని కొంత విరామం తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచానలే పెట్టుకుందట.

ఇక ఈ సినిమా కథాంశం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీర్చిదిద్దామని దర్శకుడు తెలిపారు. మాస్ మహారాజ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపించబోతున్నారు. ఈ సినిమాతో పాటు శృతి టాలీవుడ్ లో మరిన్ని బిగ్ ప్రాజెక్ట్ కోసం స్కెచ్ వేస్తోందట. తనకున్న పరిచయాలని వాడుకుంటూ మరిన్ని చిత్రాల్ని అంగీకరించాలని ప్లాన్ చేసుకుంటోందట. దీంతో ఇకపై ఈ అమ్మడు చరణ్-బన్ని-ప్రభాస్- ఎన్టీఆర్ వంటి స్టార్లకు అందుబాటులోకి వచ్చినట్టేనని భావిస్తున్నారు. అయితే గ్యాప్ వల్ల ఫేడవుట్ అన్న టాక్ వచ్చేశాక వీళ్లంతా తనకు అవకాశాలిస్తారా? అన్నది చూడాలి. ఇక అగ్ర హీరోల్లో చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున వంటి స్టార్లకు శ్రుతి సూటవుతుందా? అంటే ఆడియెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూట్ కాదనే చెప్పాలి. అయితే అగ్ర హీరోయిన్ హోదాలో వెలిగిపోయిన శ్రుతిహాసన్ వ్యక్తిగత జీవితం కోసం అన్నిటినీ కాదనుకుంది. వదులుకుని వెళ్లిపోయి చేజేతులారా చేసుకుంది. అయితే ఇప్పుడు ఎలా కంబ్యాక్ అవుతుంది? అన్నది ఆసక్తికరం.
Please Read Disclaimer