‘అండర్ వాటర్’లో కూడా శృతి పాప ఆహా అనిపించేనా..!

0

చలనచిత్ర రంగంలోకి లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ అతి కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలనటిగా సినీ అరంగేట్రం చేసిన ఈ భామ నేడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగుతుంది. ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన శృతి.. తమిళ హిందీ బాషలలో కూడా హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన శృతి తన తొలి సినిమాతోనే ‘బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్’గా అవార్డు అందుకుంది. ఇక చివరిగా పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయుడు సినిమాలో కన్పించిన ఈ అమ్మడు చాలా గ్యాప్ తర్వాత రవితేజ సరసన ‘క్రాక్’ సినిమాతో మళ్లీ రానుంది. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఉండిపోవడంతో బయట పెద్దగా కన్పించట్లేదు.

అయితే మొదటి నుండి తన గ్లామర్ తో.. అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగొడుతున్న శృతి.. అండర్ వాటర్ ఫొటోషూట్కు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘నేను ఎక్కడైనా డాన్స్ చేయగలను. నేను కలగన్న ప్రదేశానికి వెళ్లగలను’ అని ఆమె ఫొటోలకు కాప్షన్ జతచేసింది. ఎల్లప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉండే శృతి ఇటీవలే అండర్ వాటర్ ఫోటోలో.. ఫోటోషూట్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. బ్లాక్ డ్రెస్ లో అమ్మడి స్విమ్మింగ్ పోజులు మత్తెక్కిస్తున్నాయి అంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో శృతికి కోటి నలభై లక్షల పైనే అభిమానులు ఉన్నారు. అంత ఫాలోయింగ్ ఉన్న ఈ సుందరి ఏం చేసినా వైరల్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ పోజులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Please Read Disclaimer