పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఏజెంట్ బ్యూటీ..!

0

ఇండియన్ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. 1996లో విడుదలైన ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకొని అటు కమల్ కెరీర్లో.. డైరెక్టర్ శంకర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అవినీతిని అరికట్టించే ఓ సామాన్యుడి ప్రణాళికల ప్రధానాంశంగా రూపొందింది భారతీయుడు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా డైరెక్టర్ శంకర్.. మరోసారి కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ సినిమాను రూపొందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటినుండి ఆటంకాలను ఎదుర్కొంటూనే ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు అవాంతరాలు అడ్డుగోడల్లా ఎదురవుతున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రేన్ విరిగిపడి షూటింగ్ స్థలంలో ఘోరమైన ప్రమాదం వాటిల్లి ప్రాణనష్టం జరిగింది. ఆ ప్రమాదం నుండి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దాం.. అనుకునేలోపు కరోనా వైరస్ విజృంభించింది. ఇక లాక్ డౌన్ వల్ల అనుకున్న షెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే ఏర్పాట్లు చేస్తుందట చిత్రయూనిట్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ నటించనుందట. గతేడాది ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన శృతిశర్మ కమల్ ఈ భారీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. మరి ఈ వార్త నిజమేనా.. శృతి ఎలాంటి పాత్ర చేయబోతుంది..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ఇక అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనట.
Please Read Disclaimer