మహేష్ 28 జక్కన్నతో కాదట!

0

ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రాజమౌళి చిత్రం ఖచ్చితంగా మహేష్ బాబుతో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. చాలా కాలంగా వీరిద్దరి ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తుంది. బాహుబలి తర్వాత మహేష్ తో చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చేయాల్సి వచ్చింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు సినిమానే చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా రాజమౌళి చెప్పాడు.

ఆర్ఆర్ఆర్ చిత్రం అనుకున్న సమయంకు పూర్తి అయితే వచ్చే ఏడాది చివరి వరకు మహేష్ బాబుతో మూవీని జక్కన్న షురూ చేసేవాడు. కాని ఈ విపత్కర పరిస్థితుల కారణంగా ఆర్ఆర్ఆర్ చిత్రం చాలా ఆలస్యం అవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న సినిమాను ఆరు నెలల పాటు వాయిదా వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగానే మహేష్ బాబు మూవీ ఆలస్యం అవ్వబోతుందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సర్కారు వారి పాట అంటూ ఆ సినిమాకు ఇప్పటికే టైటిల్ ను ఖరారు చేసి అధికారిక ప్రకటన చేశారు.

వచ్చే ఏడాదిలో ఆ సినిమా రాబోతుంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలోనే మహేష్ తన 28వ చిత్రాన్ని చేస్తాడని అంతా అనుకున్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జక్కన్నతో సినిమాకు ముందు మహేష్ మరో సినిమాను కూడా చేసే అవకాశం ఉందని.. రాజమౌళి 2022 వరకు టైం తీసుకునే అవకాశం ఉంది కనుక అప్పటి వరకు సర్కారు వారి పాట విడుదల చేసి మరో సినిమాను కూడా పూర్తి చేసేంత టైం మహేష్ కు ఉంటుంది. మహేష్ 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఉండవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer