మహేష్27 ను మహేష్ బాషా అంటున్నారేంటబ్బా?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం లో చేస్తున్న సంగతి తెలిసిందే. #మహేష్27 గా వ్యవహరించే ఈ సినిమా కు ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక డాన్ పాత్రలో కనిపిస్తారని.. వైజాగ్ పోర్ట్ అంతా మహేష్ కను సన్నల్లో ఉంటుందనే విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది.

ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తారని ప్రచారం సాగుతోంది కానీ అది నిజం కాదట. మహేష్ డ్యూయల్ క్యారెక్టరైజేషన్ లో కనిపిస్తారట. ఆ రెండు షేడ్స్ కూడా పూర్తి విభిన్నంగా ఉంటాయట. డాన్ గా కనిపించడం సినిమాకు కీలకమని..అయితే మరో షేడ్ లో ఒక ప్రొఫెసర్ గా కనిపిస్తారని సమాచారం. మహేష్ కెరీర్ లో ఇలా ప్రొఫెసర్ గా కనిపించడం మొదటిసారి. రజనీకాంత్ కు ‘బాషా’ ఎలాగో మహేష్ బాబు కు ఈ సినిమా అలాగేనని #మహేష్27 టీమ్ కు సన్నిహితంగా ఉండేవారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ‘బాషా’ అనేది ఒక క్లాసిక్ ఫిలిం. ‘బాషా’ తర్వాత ఆ జోనర్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఒక్క సినిమా కూడా ‘బాషా’ స్థాయిలో నిలవలేదు. మరి ఈ సినిమా స్క్రిప్ట్ పై అంత నమ్మకంగా ఉన్నారంటే గొప్ప విషయమే. సినిమా రిలీజ్ అయితే కానీ అది నిజమా కాదా అనేది తెలియదు.

వంశీ పైడిపల్లి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన గత చిత్రం ‘మహర్షి’ మంచి విజయం సాధించింది. #మహేష్27 తో వంశీ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చెయ్యగలడా అనేది వేచి చూడాలి. ఈ సినిమాను మార్చ్ లో లాంచ్ చేస్తారని సమాచారం.
Please Read Disclaimer