గాల్వాన్ లోయ ఘర్షణపై మూవీ.. ఎవరా లక్కీ హీరో?

0

భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో భారత సైన్యంతో చైనా సైన్యం(పీ.ఎల్.ఏ) ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. అక్కడ హింసాత్మక ఘర్షణల్లో 21 మంది భారత జవాన్లు సాహసికులు తమ ప్రాణాలను అర్పించారు. ఈ వార్ లో 40 మంది ప్రత్యర్థులను మన భారతీయ సైన్యం మట్టు బెట్టిందని అమెరికా పత్రికల్లో ప్రధానంగా హైలైట్ అయ్యింది. ఈ ఘటన మొత్తం భారత దేశాన్ని ఏకతాటి పైకి తెచ్చింది. చైనాకు వ్యతిరేక పోరు లో మోదీ ప్రభుత్వానికి ప్రజల నుంచి విపక్ష-ప్రతి పక్షాల నుంచి సపోర్ట్ దక్కింది. ఇప్పుడు ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో సినిమాల కు సన్నాహాలు చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రముఖ మలయాళ నటుడు-దర్శకుడు మేజర్ రవి భారత-చైనా సరిహద్దు వివాదంపై `బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్` పేరుతో ఒక చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది.

అయితే ఈ మూవీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మేజర్ రవి దేశభక్తి సినిమాల్ని తెరకెక్కించడంలో దిట్ట. ఇటీవల `1971: బియాండ్ బోర్డర్స్` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందించిన వార్ డ్రామా ఇది. మలయాళంలో విజయం సాధించింది. ఇంతకుముందు పాక్ తీవ్రవాదంపై వార్ నేపథ్యంలో విక్కీ కౌశల్ హీరోగా `ఊరి` తెరకెక్కి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు గాల్వాన్ లోయలో ఘర్షణల్ని అంతే ఉద్విగ్నభరితంగా తెరకెక్కిస్తారా? అన్నది చూడాలి. ఇక ఈ మూవీలో మోహన్ లాల్ తో పాటు నటించే యంగ్ స్టార్లు ఎవరు? పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తారా? అన్నది చూడాలి.
Please Read Disclaimer