సుశాంత్ ని దారుణంగా అవమానించిన స్టార్ హీరోయిన్

0

సీక్వెన్స్.. కాన్ సీక్వెన్స్ దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలిసొచ్చింది ఆ స్టార్ హీరోయిన్ కి. నెటిజనులు సందర్భం చూసి ట్రోలింగ్ తో తిత్తి తీశారు. మరోసారి అలా నోరు జారకూడదన్న జ్ఞానోదయం కలిగించే ప్రయత్నం చేశారు. అంతగా ఆ స్టార్ హీరోయిన్ ఏం తప్పు చేసింది? ఎందుకని చీవాట్లు తింటోంది? అంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాలి.అది కేదార్ నాథ్ రిలీజ్ టైమ్. చిత్రబృందం రిగరస్ గా ప్రమోషన్స్ చేస్తోంది. ఆ సమయంలో స్టెప్ డాటర్ సారా అలీఖాన్ డేటింగ్ పై ఓ ప్రముఖ చానెల్ లైవ్ షోలో కరీనా కపూర్ ఖాన్ కి ఆసక్తికర ప్రశ్న. దానికి కరీనా ఇచ్చిన సమాధానం వీక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. అంత పెద్ద స్టార్ నుంచి అలాంటి ఆన్సర్ ని ఎవరూ అంచనా వేయలేదు. కానీ అనకూడని మాట అని అడ్డంగా బుక్కయ్యింది ఇప్పుడు. ఇంతకీ ఏమంది అంటే..!`డేటింగ్ విషయమై సారాకు నీవు ఇచ్చే టిప్ ఏమిటి? అన్న కరణ్ ప్రశ్నకు.. అని వ్యాఖ్యాత ప్రశ్నించగా… “నీ మొదటి హీరోతో మాత్రం డేటింగ్ కు వెళ్లొద్దు“ అని తన సరసనే ఉన్న సారాకు కరీనా చెప్పింది. అంతేనా.. సుశాంత్ సింగ్ చెత్త మొహం అందగాడు కాదు అంటూ విమర్శించింది.

తాజాగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కరీనా వ్యాఖ్యల్ని నెటిజనులు తీవ్రంగా తప్పు పట్టారు. నటవారసులకే పట్టంగట్టే చోట కరీనా అహంకారం చూశారా? అంటూ ఆ వీడియోని అంతే వైరల్ చేస్తున్నారు. నెపోటిజం.. ఇండస్ట్రీ మాఫియా.. అంటూ ఖాన్ లు కపూర్ ల తిత్తి తీస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer