2020 ఇప్పటివరకు ఆ రెండింటితోనే.. స్టార్ కమెడియన్ ఫన్నీ పోస్ట్..!

0

పెళ్లి చూపులు’ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు ప్రియదర్శి పులికొండ. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అయితే ప్రియదర్శి కేవలం కామెడీకే పరిమితం కాకుండా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా విభిన్నమైన విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. ఓ వైపున కమెడియన్ గా నవ్విస్తూనే.. మరో వైపున కీలకమైన పాత్రలను చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘అర్జున్ రెడ్డి’ ‘కణం’ ‘తొలిప్రేమ’ ‘అ’ ‘గ్యాంగ్ లీడర్’ ‘వరల్డ్ ఫేమస్’ ‘బ్రోచేవారెవరురా’ లాంటి సినిమాలలో తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు దర్శి. స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిన ప్రియదర్శి హీరోగా మారి ‘మల్లేశం’ అనే చిత్రంలో నటించారు. ఆ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కడానే చెప్పాలి. ఆ తర్వాత ‘మిఠాయి’ అనే సినిమాలో లీడ్ రోల్ పోషించాడు. కాగా ప్రియదర్శి పెట్టిన ఫన్నీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా ప్రియదర్శి కూడా ఇంటికే పరిమతయ్యాడు. దీంతో దర్శి తన పర్సనల్ విషయాలతో పాటు సినిమా సంగతులను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ ఆసక్తికర ఫన్నీ పోస్ట్ పెట్టాడు ఈ స్టార్ కమెడియన్. తన ఇంటి దండెం మీద మాస్క్ మరియు షార్ట్ వేలాడుతున్న ఫోటోను షేర్ చేసిన ప్రియదర్శి ”#ఎస్సెన్షియల్స్ #2020 సో ఫార్” అని ఫన్నీ క్యాప్షన్ పెట్టాడు. ప్రియదర్శి సెన్స్ ఆఫ్ అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రెజెంట్ సిచ్యుయేషన్ కి తగ్గట్టు దర్శి పెట్టిన ఈ ఫన్నీ పోస్ట్ పై నెటిజన్స్ అదే రీతిలో స్పందిస్తున్నారు. ‘వాటిలో ఒకటి మూతికి రక్షణగా ఉపయోగపడుతుంది.. మరొకటి దీనికో రక్షణగా ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.

కాగా ఇటీవల జీ 5 ఓటీటీలో విడుదలైన ‘లూజర్’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు ప్రియదర్శి. అక్కినేని నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్) మరియు జీ 5 వారు కలిసి ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో దర్శి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ‘వి’ ‘జాతి రత్నాలు’ మరియు ప్రభాస్ సినిమాలలో నటించాడు దర్శి. మొత్తం మీద కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ చేస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.