నిర్మాతల బ్రేకప్ కు కారణమైన స్టార్ కపుల్

0

అదో అగ్ర నిర్మాణ సంస్థ మొదటి మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు. ఆ తర్వాత రెండు ఫ్లాపులు వచ్చాయి కానీ ప్రాజెక్ట్స్ ని మాత్రం వరుస బెట్టి నిర్మాణంలో ఉంచారు. ముగ్గురు ఎన్ ఆర్ ఐ స్నేహితులు అతి తక్కువ టైంలో ఈ స్థాయికి రావడం కొందరికి ఈర్ష్యను సైతం కలిగించింది. ఇటీవలే ఒక పార్ట్ నర్ బయటికి వచ్చేశారు. అధికారికంగా చెప్పలేదు కానీ లోలోపల ఫిక్స్ అయినట్టు సమాచారం. దీనికి కారణం తెలుగులో వంద కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరో అతని వ్యవహారాలు చూసుకునే భార్య కారణమనే టాక్ ఫిలిం నగర్ లో గుప్పు మంటోంది.

దాని ప్రకారం కొన్ని నెలల క్రితం ఓ క్రేజీ దర్శకుడి కాంబోలో ఈ హీరోతో సదరు సంస్థ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. కథ ఎన్ని నెలలైనా ఫైనల్ కాకపోవడంతో ఇంకో స్టార్ హీరోతో ఇదే కథతో అదే దర్శకుడితో చేయబోతున్నట్టు ఈ సంస్థ ప్రకటన ఇవ్వడంతో మండిన మొదటి హీరో తూచ్ మీతో చెయ్యను అని గుడ్ బై చెప్పేశాడు. దాని కోసం అంతకు ముందు తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కు ఇచ్చాడు.

దీనికి భార్య కూడా మద్దతు తెలిపి ఇకపై ఆ బ్యానర్ లో చేయడమే వద్దని తేల్చి చెప్పేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ సంస్థ నుంచి బయటికి వచ్చిన నిర్మాత ఈ పరిణామాల వల్లే బాగా హర్ట్ అయిపోయి తన షేర్ తీసుకుని బైబై చెప్పాడట. నివురు గప్పిన నిప్పులా ఇది మూడు నెలల నుంచి తెరవెనుక జరుగుతూనే ఉందట. ఈ కారణం వల్లే ఓ క్రేజీ యూత్ హీరోతో తీసిన ఓ మూవీ ఏకంగా మూడు నెలలు ఆలస్యమైనట్టుగా తెలిసింది. ఇండస్ట్రీ అంటేనే అంత. చిత్రవిచిత్రమైన కథలు ఇలాగే జరుగుతూనే ఉంటాయి
Please Read Disclaimer