స్టార్ డైరెక్టర్ ని టార్గెట్ చేసిన ట్రోలర్స్

0

ఏదైనా స్టార్ హీరో నుండో స్టార్ డైరెక్టర్ నుండో సినిమా టీజర్ అంటే చాలు జనాలంతా సోషల్ మీడియాలోనే తిష్ట వేసుకొని ఉంటారు. అయితే అందులో వారిని అభిమానించే వారితో పాటు ద్వేషించే వారు ఉంటారన్నది అందరికీ తెలిసిందే.

తాజాగా ‘అల వైకుంఠపురములో ‘ టీజర్ రిలీజై అందరినీ ఎట్రాక్ట్ చేసింది. అయితే ట్రోలర్స్ మాత్రం టీజర్ లో త్రివిక్రమ్ వాడిన షాట్స్ ను అతని మరో సినిమాతో కంపేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి ట్రోలర్స్ పెట్టే పోస్టులు కూడా ఔరా అనిపించేలానే ఉన్నాయి. గత సినిమాల్లో తీసిన షాట్స్ ని మళ్ళీ యాజిటీజ్ గా వాడేసుకున్నాడు త్రివిక్రమ్. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. ఇక ‘అ ఆ’ నుండి ట్రోలర్స్ చేతిలో చిక్కుతూ వస్తున్నాడు త్రివిక్రమ్.

అయితే టీజర్ కూడా అంత కొత్తగా ఏమి లేదనే టాక్ కూడా ఉంది. గతంలో త్రివిక్రమ్ సినిమాల సన్నివేశాలే మళ్ళీ ఈ సినిమాలో కూడా చూడబోతున్నామా అనే వారు కూడా లేకపోలేరు.
Please Read Disclaimer