శీనయ్య కు రిపేర్లు నిజమా?

0

మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. శీనయ్య అనేది మూవీ టైటిల్. ఈ చిత్రానికి శంకర్ శిష్యుడు నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల గ్రాండ్ గా సినిమా ఓపెనింగ్ జరిగింది. అవసరం మేర సెట్స్ వేసి ఇప్పటికే చిత్రీకరణ మొదలు పెట్టారు. కొన్నిప్రచారం చిత్రాలను బయట కు వదిలారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ హోల్డ్ పడిందన్న వార్త వేడెక్కిస్తోంది. ఇటీవలే రెషస్ చూసుకున్న దిల్ రాజు ఔట్ పుట్ పై సంతృప్తి గా లేరుట. సన్నివేశాలన్నీ బ్యాక్ టు బ్యాక్ రొటీన్ గానే ఉన్నాయని…స్క్రిప్టు విన్నప్పటి ఎగ్జయిట్ మెంట్ రసెష్ చూసినప్పుడు కలగలేదని ప్రచారమవుతోంది. దీంతో స్క్రిప్టు పరమైన మార్పులు చేసి రీ షూట్ కి వెళ్లాలని ఆదేశించారట.

తాజాగా శీనయ్య కు రిపేర్లు అంటూ సాగుతున్న ప్రచారం లో నిజం ఎంత? అన్నది చిత్ర బృందమే తేల్చాల్సి ఉంది. దీనిపై వినాయక్ ఏమని స్పందిస్తారో చూడాలి. ఎందరో స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్లు అందించిన దర్శకుడిగా వినాయక్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దర్శకత్వానికి కామా పెట్టి.. నటుడిగా చేస్తోన్న తొలి ప్రయత్నమిది. కానీ ఆరంభం లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక కథల ఎంపిక విషయం లో దిల్ రాజు జడ్జిమెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. స్క్రిప్ట్ సెలక్షన్ పై అపార అనుభవం గల నిర్మాత. రాజు గారి జడ్జిమెంట్ పక్కా గా ఉంటుందన్న టాక్ ఉంది.

అయితే ఆయన స్వయంగా స్క్రిప్టు విన్న తర్వాతనే కదా సెట్స్ కెళ్లింది? ఇప్పుడు ఆయనే నచ్చలేదన్నారా? తనని నిర్మాత గా పరిచయం చేసిన వినాయక్ విషయం లో రాజుగారు ఆ మాత్రం కేరింగ్ తీసుకోవడం సహజమే కదా! పంపిణీ దారుడిగా ఉన్న రాజుని దిల్ సినిమా తో వినాయక్ నిర్మాత గా పరిచయం చేసారు కాబట్టి తనకో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. అందుకే ఈ ముందస్తు జాగ్రత్తలు అనుకోవాలేమో!
Please Read Disclaimer