టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో ముద్దుల కుమార్తె

0

రంగం ఏదైనా వారసులు ఇచ్చే ఎంట్రీకి ఆదరణ మాత్రమే కాదు.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నది తెలిసిందే. రాజకీయ.. సినీ రంగాల వరకూ వస్తే.. తమ.. తమ వారసుల్ని బరిలోకి దింపేందుకు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా సినిమా రంగంలో ఒక హీరో తన కొడుకును తన వారసుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు తన సర్వశక్తుల్ని ఒడ్డటం చూస్తున్నదే.

తమ వారసుల్ని హీరోలుగా పరిచయం చేసే విషయం లో అగ్ర నటులు పడే తపన అంతా ఇంతా కాదు. హీరోలుగా తమ వారసుల్ని దింపే అగ్రనటులు.. తమ కుటుంబం లోని అమ్మాయిల్ని వెండి తెరకు పరిచయం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపని వైనం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే.. తమ నట వారసుల్ని పరిచయం చేసే నటులు తమ ఇంట్లోని అమ్మాయిల్ని మాత్రం సినిమాల్లో యాక్ట్ చేయటానికి ఏ మాత్రం సంకోచించరు. కానీ.. తమ కుమార్తెల్ని తీసుకొచ్చే విషయంలో మాత్రం అగ్రనటులు ఎవరూ రెఢీగా ఉండరు.

ఈ తీరుకు కాస్త మినహాయింపు గా మంచు వారింటి నుంచి లక్ష్మీ.. మెగా కుటుంబం నుంచి నిహరికలు వచ్చినా.. వారు తమదైన ముద్రను ప్రేక్షకుల మీద వేయలేకపోయారనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ను టాలీవుడ్ కు పరిచయం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమ లో ఎంట్రీ ఇచ్చినప్పటికి అక్కడ పెద్దగా సక్సెస్ కాలేదు.

హీరోయిన్ ఛార్మ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో మెరిసే అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఇప్పటికే తమిళ..కన్నడ చిత్రాల్లో నటించారు. తమిళంతో పోలిస్తే కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఐశ్వర్య అర్జున్ తాజాగా తెలుగు సినిమాకు చేయనున్నట్లు చెబుతున్నారు. తమిళ.. కన్నడలో నాలుగైదు సినిమాలు చేసినా కలిసి రాని వేళ. తాను దర్శకత్వం వహించనున్న తొలి సినిమాకు నిర్మాత కూడా రెఢీ అయిపోయినట్లుగా తెలుస్తోంది. మరి.. తెలుగు ప్రేక్షకులు అర్జున్ వారి అమ్మాయిని ఎలా అక్కున చేర్చుకుంటారో చూడాలి.
Please Read Disclaimer